అవికా గోర్ రొమాంటిక్ మూవీ టైటిల్ ఇదిగో!

  • IndiaGlitz, [Wednesday,June 30 2021]

యంగ్ బ్యూటీ అవికా గోర్ నేడు తన 24వ పుట్టినరోజు జరుపుకుంటోంది. దీనితో ఆమెకు సన్నిహితుల నుంచి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా అవికా గోర్ కొన్ని రోజుల క్రితం తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 'అవికా స్క్రీన్ క్రియేషన్స్' పేరుతో అవికా గోర్ సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించింది.

ఈ బ్యానర్ లో తొలి చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో అవికా గోర్, సాయి రాంక్ జంటగా నటిస్తున్నారు. అవికా బర్త్ డే సందర్భంగా నేడు ఈ చిత్ర టైటిల్ రివీల్ చేశారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'పాప్ కార్న్' అనే కూల్ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మోషన్ పోస్టర్ లో అవికా, సాయి రాంక్ ట్రెండీగా కనిపిస్తున్నారు. అవికా చేతిలో డ్రింక్ పట్టుకుని సాయి రాంక్ వైపు రొమాంటిక్ గా చూస్తోంది.

మురళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉయ్యాల జంపాల చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ నటిగా ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం అవికా పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.

More News

విజయ్ 'బీస్ట్'లో స్టార్ హీరో కామియో.. ఎవరో తెలుసా..

ఇలయదళపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

దర్శకుడికి థ్యాంక్స్ చెప్పిన స్టార్ హీరో మేనేజర్.. ఎందుకో తెలుసా!

ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్స్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్, తమిళ దర్శకుడు అట్లీ కాంబో ముందు వరుసలో ఉంటుంది.

వెంకీ డబుల్ ట్రీట్.. నారప్ప, దృశ్యం 2 డైరెక్ట్ ఓటిటి రిలీజ్

విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులని డబుల్ వినోదం అందించేందుకు రెడీ అవుతున్నాడు.

RRR మార్ఫింగ్ పోస్టర్ పోస్ట్ చేసిన డేవిడ్ వార్నర్.. రషీద్ ఖాన్ కామెంట్!

యావత్ దేశం ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో

చిరంజీవి గురించి అలా ప్రచారం చేయడం దారుణం: కాంగ్రెస్ పార్టీ

2008లో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే.