close
Choose your channels

బిగ్‌బాస్ కోసం రూ.10 లక్షలు కట్టిన అవినాష్..

Friday, September 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ కోసం రూ.10 లక్షలు కట్టిన అవినాష్..

బిగ్‌బాస్ సీజన్ 4లోకి ముక్కు అవినాష్ గురువారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గుండెలకు హత్తుకునే ఏవీతో అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. తను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ ఆ ఏవీలో చూపించారు. అవినాష్ నవ్వుల వెనుక ఎంత విషాదముందో ఏవీ చూసిన వారందరికీ అర్థమవుతుంది. ఒక స్థాయికి రావడం కోసం ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడో.. రూపాయి కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో కళ్లకు కట్టినట్టు చూపించారు.

అయితే బిగ్‌బాస్ షోలోకి అవినాష్ ఎంట్రీ ఏమీ సాదాసీదాగా జరగలేదు. అవినాష్ జీవితంలో ఏదీ సులభంగా లభించలేదని ఆయన ఏవీని చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో ఎంట్రీ కూడా సులభంగా ఏమీ దక్కలేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరీ అడుగు పెట్టాల్సి వచ్చింది. బిగ్‌బాస్‌కి రావాలంటే తాను చేస్తున్న జబర్దస్త్‌ను ఒదులుకోవాలి. జబర్దస్త్ టీంకు అవినాష్ కో లీడర్‌గా ఉన్నాడు. జబర్దస్త్‌కి వెళ్లడానికి ముందే కంటెస్టెంట్‌లు అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అవినాష్ జబర్దస్‌ను వీడాలంటే ఆ అగ్రిమెంటే అడ్డొచ్చిందని తెలుస్తోంది. అవినాష్ బయటకు వెళ్లేందుకు జబర్దస్త్ నిర్వాహకులు అంగీకరించలేదని సమాచారం.

అగ్రిమెంట్ పేపర్‌ను చూపించి అడ్డుకునేందుకు యత్నంచినట్టు సమాచారం. ఇటు ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మాత్రమే బిగ్‌బాస్ షోకు రావాలని నిర్వాహకులు నిబంధన విధించినట్టు తెలుస్తోంది. మరోవైపు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలంటే రూ.10 లక్షలు కట్టాల్సిందేనని జబర్దస్త్ మేనేజ్‌మెంట్ తెగేసి చెప్పినట్టు సమాచారం. దీంతో చేసేదేమీ లేక అవినాష్.. రూ.10 లక్షలు కట్టక తప్పలేదట. ఎలాగైతేనేం మనోడు రూ.10 లక్షలతో పాటు తన కెరీర్‌ను కూడా ఫణంగా పెట్టి బిగ్‌బాస్‌కు వచ్చాడు. మరి ఈ షో అవినాష్‌కు ఎలా కలిసి వస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.