అవినాష్‌కి బంపర్ ఆఫర్.. టాప్ 5లో ఛాన్స్?

  • IndiaGlitz, [Wednesday,November 25 2020]

సూపర్ మచ్చి సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఇక అవినాష్, సొహైల్ మధ్య ఫన్ బాగా వర్కవుట్ అయింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ రూపంలో నామినేట్ అయిన సభ్యులకు కల్పించబోతున్నామని.. దీనికోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. దీనిలో లెవల్ 1లో భాగంగా హౌస్‌లో పెట్టిన జెండాలను సేకరించాలి. జెండాల సంఖ్య ఆధారంగా సెకండ్ రౌండ్‌కి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక అరియానా.. అవినాష్‌తో బేరం మొదలు పెట్టింది. తనకు జెండాలు ఇవ్వమని అడిగింది. కానీ అవినాష్ నో చెప్పాడు. ఇక రెండో రౌండ్‌కి అఖిల్, అవినాష్ లెవల్ 2కి ఎంపికయ్యారు. ఇక లెవల్ 2ను బిగ్‌బాస్.. హౌస్‌మేట్స్ చేతిలో పెట్టారు. హౌస్‌మేట్స్‌ను మెప్పించి.. ఎవరు ఎక్కువ మంది మద్దతు పొందితే వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుందని చెప్పారు. అఖిల్‌కి స్లోగన్స్ రాయడంలో సొహైల్ సహాయం చేస్తే.. అవినాష్‌కి అభి, హారిక సాయం చేశారు. ఇక్కడే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి దక్కుతుందో దాదాపు తేలిపోయింది. అభి, హారిక అవినాష్‌కి ఓటు చేస్తారని అక్కడే తేలిపోయింది. అరియానా పక్కాగా అవినాష్‌కే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మూడు ఓట్లు అవినాష్‌కి పడితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అతనిదే.

అఖిల్ వెళ్లి హారికను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అదే సమయంలో అవినాష్ వెళ్లాడు. నాకు కాస్త టైమ్ ఇవ్వండని ఇద్దరినీ అడగడంతో అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కానీ అవినాష్ మాత్రం ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టాడు. అభి వెళ్లి అవినాష్‌ని అప్రిషియేట్ చేశాడు. ఇక అరియానా ఓదార్పు యాత్ర చేపట్టింది. అవినాష్‌‌ని ఓదార్చి ఓ క్లాస్ పీకింది. తరువాత అవినాష్ తరుఫున అరియానా క్యాంపెయిన్ చేసింది. అభి దగ్గరికి వెళ్లి క్రీమ్ బిస్కెట్స్ వేసి మరీ ఓటు వేయాలని కోరింది. తరువాత మీటింగ్.. అవినాష్ తన గుర్తు గుర్రం అని.. తనను ఓటు వేసి గెలిపించాలని కోరాడు. ఇక అఖిల్ అయితే అభి, మోనాల్ దగ్గరకు వెళ్లి తనకు ఓటు వేయమని అడగలేదు. అవినాష్ మాత్రం అందరినీ అడిగాడు. ఈ సమయంలో కూడా ఇగోకి వెళ్లకుంటే బాగుండేదేమో అనిపించింది.

మొదట అరియానా.. పూలమాలతో అవినాష్‌కి మద్దతు తెలిపింది. తరువాత మోనాల్.. అఖిల్‌కి పూలమాల వేసి మద్దతు తెలిపింది. సొహైల్ కూడా అఖిల్‌కు మద్దతు తెలిపాడు. అభి.. అవినాష్‌కి మద్దతు తెలిపాడు. ఇప్పుడు హారిక ఓటు కీలకం. పెద్ద స్టోరీ చెప్పి.. గంటన్నర పాటు ఆలోచించి చించి అవినాష్‌కి ఓటు వేసింది. దీంతో అవినాష్‌కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కింది. అయితే అఖిల్ వెళ్లి హారికను దగ్గరకు తీసుకుని ఓదార్చడం చాలా బాగా అనిపించింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌కి రెండు వారాల వాలిడిటీ ఉంటుంది. ఈ రెండు వారాల్లో అవినాష్ దానిని ఒక్కసారి వాడుకోవచ్చు. ఇక అవినాష్ చాలా ఫీలయ్యాడు. నువ్వెందుకు స్వైప్ అడగలేదని మోనాల్ అడిగింది. నేను నీతో స్వైప్ చేసుకోవాలని అనుకోలేదని.. నేను స్వైప్ చేసుకోనని చెప్పిన మనిషి.. స్వైప్ అనగానే ఎందుకు కామ్‌గా వెళ్లిపోయాడని ప్రశ్నించాడు. మొత్తమ్మీద అవినాష్‌ని ఒకసారి ఎలిమినేషన్ బారి నుంచి కాపాడి టాప్ 5లో నిలబెట్టాలని బిగ్‌బాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నామినేషన్స్ నుంచి గట్టెక్కితేనే ఇది జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఓటింగ్‌లో అవినాషే వెనుకబడి ఉన్నట్టు తెలుస్తోంది.

More News

సూర్య 40లో హీరోయిన్ ఖ‌రారైందా?

హీరో సూర్యకు 2020 బాగానే క‌లిసొచ్చింది. ఎందుకంటే చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య‌కు ఈ ఏడాది విడుద‌లైన ‘ఆకాశం నీహ‌ద్దురా’

లొకేషన్ ఛేంజ్ చేసిన నితిన్..!

నితిన్, కీర్తిసురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా ఫైన‌ల్ ద‌శ షూటింగ్‌కు చేరుకుంది.

‘ఆర్ఆర్ఆర్‌’లో మ‌రో ఇద్దరు సూప‌ర్‌స్టార్స్‌

తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్

నాని 28.. ఆ సినిమా స్టైలేన‌ట‌..!

రీసెంట్‌గా నేచుర‌ల్ స్టార్ నాని, నజ్రీయా జంట‌గా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంటే సుందరానికీ’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం: బండి సంజయ్

బీజేపీకి భయపడి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నిన్న మేనిఫెస్టోను విడుదల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.