హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో అస్సలు తిరగకండి!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మరీ ముఖ్యంగా మర్కజ్ సమావేశాలకు వెళ్లిన వారిలో తెలంగాణలో హైదరాబాద్ నుంచి.. ఏపీలో కర్నూలు నుంచి ఎక్కువగా వెళ్లడంతో ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి..? ఏయే ప్రాంతాలు కరోనాకు హాట్ స్పాట్స్..? ఏయే ప్రాంతాల్లో జనాలు అస్సలు తిరగకూడదు..? అనేదానిపై తాజాగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. కాగా.. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటికి డాక్టర్ వెళ్లనున్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 580 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా సోషల్ డిస్టన్స్, లాక్‌డౌన్‌కకు విరుద్ధంగా బయటికి రాకుండా ఉండాలని లోకేష్ కుమార్ వెల్లడించారు.

ఈ ఏరియాల్లో తిరగకండి..
మొత్తం హాట్ స్పాట్‌లు : 12
01. రెడ్ హిల్స్
02. షేక్ పేట
03. హఫీజ్ బాబా నగర్
04. మలక్ పేట్
05. యూసఫ్ గూడ
06. అల్వాల్
07. సంతోష్ నగర్
08. రాంగోపాల్ పేట
09. కుత్బుల్లాపూర్‌ (కంటోన్మెంట్‌లోని కొన్ని ప్రాంతాలు)
10. మౌలాలి
11. బాలాపూర్
12. బడంగ్ పేట్ (కంటైన్‌మైంట్ ప్రాంతాలు).

పైన చెప్పిన ఏరియాల్లోకి జనాలు వెళ్లకుండా .. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో వెళితే మాత్రం తగు జాగ్రత్తలతో వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో.. తస్మాత్ జాగ్రత్త హైదరాబాదీలు.

More News

లాక్‌డౌన్ పొడిగింపు పక్కా.. IRCTC సంకేతాలు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి మార్చి 24 నుంచి ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం విదితమే.

ఒక్కరోజే ఇండియాలో 32 మంది మృతి.. 773 కరోనా పాజిటివ్‌లు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇండియాలో కూడా దీనిప్రభావం గట్టిగానే పడింది. రోజురోజుకు కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

ఎన్టీఆర్‌, మోహ‌న్‌లాల్‌... సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

ప‌వ‌న్‌, ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్‌.. రీమేకా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ నెల 11న మోదీ కీలక ప్రకటన.. వాట్ నెక్స్ట్!?

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్-11న కీలక ప్రకటన చేయబోతున్నారా..? ఆ ప్రకటన లాక్‌డౌన్ గురించేనా..? లాక్‌డౌన్ పొడిగించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయా..?