12 ఏళ్ల తరువాత బరిలోకి బాబాయ్,అబ్బాయ్

  • IndiaGlitz, [Tuesday,October 06 2015]

2016 సంక్రాంతి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎందుకంటే.. నంద‌మూరి కుటుంబానికి చెందిన బాబాయ్‌, అబ్బాయ్ లైన బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌లు ఆ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా త‌మ సినిమాల‌తో బ‌రిలోకి దిగ‌బోతున్నారు. ఈ సీజ‌న్‌లో వ‌స్తాయ‌నుకున్న కొన్ని సినిమాలు వాయిదాల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తుండ‌డంతో అంద‌రి క‌ళ్లు నంద‌మూరి వారి సినిమాల‌పై మ‌ళ్లింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

వీటిలో ముందుగా ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న 'నాన్న‌కు ప్రేమ‌తో' విడుద‌ల కానుంది. జ‌న‌వ‌రి 9న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. ఇక నాలుగైదు రోజుల గ్యాప్‌తో బాల‌కృష్ణ 99వ చిత్రం 'డిక్టేట‌ర్' రిలీజ్ కానుంది. దీనికి శ్రీ‌వాస్ డైరెక్ట‌ర్‌. విశేష‌మేమిటంటే.. స‌రిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే 2004లో జ‌న‌వ‌రి 1న 'ఆంధ్రావాలా'తో ఎన్టీఆర్‌, జ‌న‌వ‌రి 14 'ల‌క్ష్మీ న‌ర‌సింహా'తో బాల‌య్య అప్ప‌ట్లో సంక్రాంతి సీజ‌న్‌లో సంద‌డి చేశారు. అప్ప‌ట్లో బాబాయ్ దే పై చేయిగా నిలిచింది. ఈ సారి ఎవ‌రిని విజ‌య‌ల‌క్ష్మీ వ‌రిస్తుందో చూడాలి.

More News

అనుష్క పెళ్లి ఎప్పుడు...?

అందాల తార అనుష్క ఇండస్ర్టీలో అడుగుపెట్టి అప్పుడే...పదేళ్లు అయ్యింది. ఈ పదేళ్లలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

నితిన్ మూవీ రిలీజ్ డేట్ మారిందా...?

నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

రవితేజ మూవీకి న్యూ టైటిల్...

మాస్ మహా రాజారవితేజ ప్రస్తుతం బెంగాల్ టైగర్ చిత్రంలో నటిస్తున్నారు.

'జతగా' పాటల రికార్డింగ్ పూర్తి

పాత్రికేయుడిగా, 'సంతోషం' వారపత్రిక అధినేతగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా సురేశ్ కొండేటి స్వయంకృషితో మంచి స్థాయికి ఎదిగిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందగత్తెలతో సోగ్గాడే!

సోగ్గాడు అనే టైటిల్ నిజానికి శోభన్ బాబుది.ఆయన తర్వాత తెలుగు పరిశ్రమలో ఆ టైటిల్ కి అర్హుడు అక్షరాలా నాగార్జునే.