పీకేను దాటేసిన 'బాహుబలి-2'

  • IndiaGlitz, [Friday,May 05 2017]

విడుద‌ల రోజు కంటే ముందు రోజు నుండి భారీ అంచ‌నాలు మ‌ధ్య విడుద‌లైన విజువ‌ల్ గ్రాఫిక్స్ వండ‌ర్ 'బాహుబ‌లి-2' అంద‌రి అంచ‌నాల‌ను మించుతూ ముందుకు సాగుతుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా విడుద‌లైన అన్నీ భాష‌ల్లో సెన్సేష‌న్ వ‌సూళ్ళ‌ను రాబ‌డుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అమీర్‌ఖాన్ న‌టించిన పీకే సినిమా లైఫ్ టైం గ్రాస్ క‌లెక్ష‌న్స్ 745 కోట్ల రూపాయ‌లు. దీన్ని 'బాహుబ‌లి-2' కేవ‌లం ఆరు రోజుల్లోనే అధిగ‌మించ‌డం విశేషం.

ఆరు రోజుల్లో 'బాహుబ‌లి-2' 785 కోట్ల గ్రాస్‌ను సాధించ‌డం విశేషం. అన్నీ భాష‌ల్లో ఇండియా మొత్తంగా 630 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం ఓవ‌ర్‌సీస్‌లో 155 కోట్ల రూపాయ‌ల‌ను రాబ‌ట్టింది. దీంతో ఆల్ ఓవ‌ర్ ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ గ్రాస‌ర్‌గా నిలిచింది.