1500 కోట్ల 'బాహుబలి-2'

  • IndiaGlitz, [Friday,May 19 2017]

తెలుగు ప్రేక్ష‌కుడంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఆద‌రించే ప్రేక్ష‌కుడని, కొత్త‌ద‌నానికి పెద్ద పీట వేయ‌డని, ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌లు, హీరోల ఆలోచ‌న‌లు ప‌రిమితంగానే ఉంటాయ‌నే ఆలోచ‌న‌ల‌ను తిర‌గ‌రాసిన సినిమా 'బాహుబ‌లి-2'. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి రెండు పార్టులుగా తెర‌కెక్కింది.

పార్ట్‌1గా విడుద‌లైన బాహుబ‌లి ది బిగినింగ్ ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళు చేసి ఇండియ‌న్ సినిమా దృష్టిని ఆక‌ర్షిస్తే, పార్ట్ 2గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన బాహుబ‌లి-2 బాలీవుడ్ స్టార్స్ న‌టించిన అన్నీ సినిమాల దుమ్ము దులేపేసి ఏకంగా 1500 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇండియ‌న్ సినిమా క‌లెక్ష‌న్స్‌లో క‌నివినీ ఎరుగ‌ని రీతిలో క‌లెక్ష‌న్స్ రావ‌డం ఇండియ‌న్ సినిమానే కాదు, ప్ర‌పంచ సినిమానే ఆక‌ట్టుకుంది బాహుబ‌లి-2. ప‌ది రోజుల్లో 1000 కోట్లు సాధించిన ఈ చిత్రం 22 రోజుల్లో 1500 కోట్ల క్ల‌బ్‌లోకి చేరింది. ఇండియాలో 1227కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ చిత్రం ఓవ‌ర్‌సీస్‌లో 275 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేయ‌డం విశేషం. హిందీ వెర్ష‌న్‌లో 500కోట్ల రూపాయ‌ల‌ను సాధించింది.

More News

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన 'బాహుబలి-2'

ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'బాహుబలి-2'

'ఒక్కడు మిగిలాడు' చిత్రంలోని మంచు మనోజ్ సెకండ్ లుక్ విడుదల

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం "ఒక్కడు మిగిలాడు".

మే 26 న 'ఓ పిల్లా నీ వల్ల'

బిగ్ విగ్ బ్యానర్ లో కృష్ణ చైతన్య,రాజేష్ రాథోడ్,షాలు,మౌనిక జంటలుగా కిశోర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఓ పిల్లా నీ వల్ల.

'పి.ఎస్.వి.గరుడవేగ 126.18M'లో 'జార్జ్'గా కిషోర్

యాంగ్రీ యంగ్ మేన్గా వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం``పి.ఎస్.వి.గరుడవేగ 126.18M``.

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో ఘనంగా జరిగిన సెయింట్ డాక్టర్ MSG'జట్టు ఇంజనీర్' ప్రియమిర్ షో.

యం యస్ జి, యం యస్ జి 2, లయన్ హార్ట్, నాపాక్ కో జవాబ్, వంటి యాక్షన్ విత్ మెసేజ్ తో వచ్చిన నాలుగు చిత్రాల తరువాత అయిదో మూవీ'జట్టు ఇంజనీర్' మే 19న బాలీవుడ్ లో విడుదల కాబోతున్న సందర్భంగా ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో 20 వేల ప్రేక్షకుల నడుమ చిత్రం ప్రియమిర్ షో ప్రదర్శించారు.