close
Choose your channels

'బాహుబలి' మూవీ రివ్యూ

Friday, July 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం బాహుబలి. ఇండియన్ ప్రెస్టిజియస్ మూవీగా రూపొందిన ఈ చిత్ర నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. దశాబ్ద కాలం తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో మూవీ అనగానే ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అందరి అంచనాలకు అందని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్ రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పరుచుకుంది. తెలుగు,హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది, మరి భారీ అంచనాలు నడుమ విడుదలైన ఈ చిత్రం అ అంచనాలను అందుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథ తెలుసుకోవాల్సిందే....

కథ

సినిమా మహిష్మతి రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ఎంట్రీతో ప్రారంభం అవుతుంది. ప్రాణ హానితో సైనికుల నుండి తప్పించుకున్న శివగామి ఒక బిడ్డతో సహా నదిలో పడిపోతుంది. మహేంద్ర బాహుబలి పేరున్న ఆ బాలుడిని రక్షించాలంటూ దేవుడ్ని వేడుకుంటుంది. బిడ్డను నీటిలో మోస్తూ ఒడ్డుకు చేరుస్తుంది. అక్కడా కొండజాతి స్త్రీ(రోహిణి)బిడ్డను రక్షిస్తుంది. ఆ బిడ్డ శివుడు పేరుతో అక్కడే పెరుగుతాడు. అక్కడున్న కొండ చరియను ఎక్కడానికి ప్రయత్నిస్తుంటాడు శివుడు.., కానీ ప్రయత్నాలు సఫలం కావు. ఓ రోజు ఆ నదిలో ఓ ముసుగు(మాస్క్) శివుడికి దొరుకుతుంది. నది పై నుండి ఆ ముసుగు వచ్చింది కనుక అక్కడేవరో ఉన్నారనే భావనతో శివుడు ఆ కొండచరియను ఎక్కేస్తాడు. అక్కడ కొంత మంది కుంతల దేశానికి చెందిన అవంతిక(తమన్నా) చంపాలనుకోవడం, వారు చివరికి ఆమె చేతిలోనే చావడం జరిగిపోతాయి. అవంతికను శివుడు ఇష్టపడతాడు, ఓ సందర్భంలో తన ప్రేమను అవంతికకి తెలియజేస్తాడు. ఆమె కూడా శివుడి ప్రేమను అంగీకరించినప్పటికీ తనకు తన లక్ష్యం తమ దేశానికి చెందిన దేవసేన(అనుష్క)ను రక్షించడమే అని చెబుతుంది. దాంతో శివుడు మహిష్మతి రాజ్యంలో బందీగా ఉన్న దేవసేనను విడిపించడానికి వెళతాడు. మహిష్మతి రాజు భల్లాల దేవ(రానా) దగ్గర బందీగా ఉన్న దేవసేనను విడిపించే ప్రయత్నంలో కట్టప్ప(సత్యరాజ్)తో గొడవపడతాడు. ఆ గొడవ కారణంగా అందరికీ శివుడే తమని కాపాడటానికి వచ్చిన బాహుబలి అని తెలుస్తుంది? అసలు బాహుబలి ఎవరు? అతనికి, భల్లాల దేవకి సంబంధం ఏమిటి?దేవసేనను ఎందుకు బందీ అవుతుందో తెలసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్

అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన సూపర్. శివుడిగా కూడా మంచి వేరియేషన్ ను చూపించాడు. తన నటనతో ప్రక్షకులను, అభిమాలను అలరించాడు. దేవసేనగా అనుష్క తొలి పార్ట్ లో 10 నిమిషాలు మాత్రమే కనపడుతుంది. తన నటనలో పెద్దగా చెప్పుకోవడానికి ఈ ఫస్ట్ పార్ట్ లోఏం లేదు. తొలిసారి విలన్ గా కనపడ్డ రానా నటన హైలైట్ గా నిలిచింది. కట్టప్పగా సత్యరాజ్ నటన హైలైట్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఎక్కువ భాగం తమన్నానే కనపడతుంది. యం.యం.కీరావాణి సంగీతం బావుంది. రీరికార్డింగ్ సూపర్. ముఖ్యంగా వార్ సీక్వెన్స్ లో వచ్చే పాట అర్థం చెబుతూనే సినిమా రేంజ్ పెంచే ప్రయత్నం చేశాడు. కోటగిరి వెంటేశ్వరరావు ఎడిటింగ్ బావుంది. అలాగే సెంథిల్ కుయార్ సినిమాటోగ్రఫీ నచ్చుతుంది. సెంథిల్ కుమార్ ప్రతి సన్నివేశాన్ని గ్రాండ్ గా చిత్రీకరించారు. సినిమా విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు బావున్నాయి. పచ్చ బొట్టేసినా..శివుడి ఆన.. సాంగ్స్ బావున్నాయి. సినిమా చివర్లో వచ్చే వార్ సీక్వెన్స్ హైలలైట్ అవుతుంది.

మైనస్ పాయింట్స్

కీరవాణి సంగీతం బావున్నప్పటికీ కొన్ని చోట్ల పెద్దగా ఆకట్టుకోలేదు. పచ్చ బొట్టేసినా... సాంగ్ ట్యూన్ బావుంది కానీ పిక్చరైజేషన్ ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ విషయంలో కోటగిరి వెంకటేశ్వరరావు సినిమా నిడివిని మరింత తగ్గించి ఉండవచ్చు. తమన్నా గ్లామరస్ గా ఉన్నప్పటికీ సీరియస్ రోల్ లో నటించలేకపోయింది. సీన్స్ లోని ఎమోషన్స్ కొన్ని బావున్నా ఆ ఎమోషన్స్ ను క్యారీ చేయలేకపోయారు. యుద్దం గురించి ఆలోచించేవాడు సైనికుడు అయితే, ప్రజల గురించి ఆలోచించేవాడే రాజు.., వంద మందిని చంపినవాడు వీరుడైతే ఒక్కడిని బతికించినవాడు దేవుడౌతాడు అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్స్ మినహా చెప్పుకోదగ్గ డైలాగ్స లేవు.

విశ్లేషణ

విజువల్ వండర్ గా రూపొందిన బాహుబలి సమ్మర్ లోనే విడుదల కావాల్సింది. ఇప్పటికి విడుదలైంది. సినిమా స్టార్టింగ్ డే నుండి ఇప్పటి వరకు సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు సినిమా భారీ బడ్జెట్ తో రూపొందడం, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో అత్యధిక థియేటర్స్ లో సినిమాలో సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రభాస్, రానా, సత్యరాజ్, నాజర్ వంటి నటీనటుల పెర్ ఫార్మెన్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. అయితే కథలో కొన్ని లాజిక్స్ మిస్ కావడం, విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో ప్రభాస్ చేసిన నటన కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. తమన్నా గ్లామర్ రోల్స్ చేసినంత చేయలేనని ప్రూవ్ అయింది. అయితే విజవల్ ఫీస్ట్ గా వచ్చిన చిత్రం కోసం ఒక యాక్టర్ మూడేళ్ల సమయనాన్ని కేటాంచడం ఒక రకంగా సబబు అయినప్పటికీ సినిమాలో ఫీల్ క్యారీ కాలేదు.

బాటమ్ లైన్: విజువల్ ఫీస్ట్ గా అలరించింన `బాహుబలి`

రేటింగ్: 3.25/5

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.