మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న 'బాబు బాగా బిజి'

  • IndiaGlitz, [Sunday,April 16 2017]

మంచి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌ట‌మే ధ్యేయంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా... దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని A స‌ర్టిఫికేట్ పొందింది. మే 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ... అవ‌స‌రాల శ్రీనివాస్ చేసిన అన్ని చిత్రాల‌కంటే బాబు బాగా బిజి చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కించాము. ఈ చిత్రం ద్వారా నవీన్ మేడారం ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చాలా బాగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా యూత్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు ఇప్ప‌టికే మార్కెట్ లో విడుద‌లై, చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే పాటలు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని స‌భ్యుల‌చే ప్ర‌శంసలు అందుకుంది. A స‌ర్టిఫికేట్ తో చిత్రం మే 5న పెర్‌ఫెక్ట్ స‌మ్మర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. అని అన్నారు.
అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు.

More News

ఎస్ బికె ఫిలింస్ కార్పోరేషన్ లో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాటి ల చిత్రం

సందీప్ కిషన్,లావణ్య త్రిపాటి,జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి.కుమార్ దర్శకత్వంలో

డబ్బింగ్ కార్యక్రమాల్లో 'ఉంగరాల రాంబాబు'

కమర్షియల్ సక్సస్ లు తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా,మంచి చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో

'బ్లాక్ మనీ' 'అన్నీ కొత్త నోట్లే'ఆడియో విడుదల

'జనతా గ్యారేజ్,మన్యం పులి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,

విక్రమ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో కలైపులి థాను నిర్మిస్తున్న 'స్కెచ్'

'శివ పుత్రుడు','అపరిచితుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు చియాన్ విక్రమ్.

నాని విడుదల చేయనున్న 'అమీ తుమీ' టీజర్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో