వైఎస్ జగన్ సర్కార్‌కు షాక్‌ల మీద షాక్‌లు!!

  • IndiaGlitz, [Tuesday,July 23 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్ సర్కార్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పీపీఏల విషయంలో కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆ తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే తనిఖీలు నిర్వహించాల్సిందేనని చెప్పిన ప్రపంచబ్యాంక్ చివరికి తప్పుకుంది. రాజధాని డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకువరల్డ్ బ్యాంకు అందిస్తామన్న రుణ సాయాన్ని నిలిపివేసింది. గతంలో రూ.2వేల 100 కోట్లు అందిస్తామంటూ ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్‌.. ఇప్పుడు ఆ నిధులు ఇవ్వటానికి వెనకడుగు వేసింది. ప్రపంచ బ్యాంక్ యూటర్న్ తీసుకోవడానికి సీఎం జగన్‌ వైఖరే కారణమని టీడీపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. దీంతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి బ్రేక్‌లు పడినట్లైంది. ఇవన్నీ గత నెలరోజులుగా జరుగుతున్న వ్యవరాలు.

మరో ఎదురుదెబ్బ!!

అయితే తాజాగా.. ఏకంగా మరో కీలక బ్యాంకు జగన్ సర్కార్‌కు షాకిచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్(ఏఐఐబీ) తేల్చి చెప్పింది. దీంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. బ్యాంకులు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతుండటంతో ఏపీ సర్కార్‌కు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మొత్తమ్మీద రాజధాని అమరావతి నిర్మాణంపై పెను ప్రభావం పడుతోందని విశ్లేషకులు, నిపుణులు వాపోతున్నారు. వాస్తవానికి అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వరల్డ్ బ్యాంక్ వెనక్కి తగ్గడంతోనే..!

తాజాగా.. ఏపీ ప్రభుత్వ వైఖరి చూశాక.. రుణం ఇవ్వకపోవడమే మంచిదని ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుని సర్కార్‌కు ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది. మొదట ప్రపంచ బ్యాంక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అదే బాటలోనే ఏఐఐబీ నడిచింది. అయితే ఇలా రోజుల వ్యవధిలోనే వరుసగా ఇలా బ్యాంకులు షాక్‌లిస్తుండటం గమనార్హం. ఈ వరుస పరిణామల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఏం చేయబోతోంది..? అమరావతి గతేంటి..? అమరావతి నిర్మాణం ఉంటుందా..? ఉండదా..? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మున్ముంథు ఇంకెన్ని బ్యాంకులు షాకులిస్తాయో.. సర్కార్ ఎలా ముందుకెళ్తుందో అర్థం కాని పరిస్థితి.

More News

రోజా ర‌స‌జ్ఞ‌త‌, పురాణ పండ ప్ర‌యోగజ్ఞ‌త‌లే `శ్రీపూర్ణిమ‌'

మ‌న జీవన విధానానికి, స‌మాజ సంస్కృతుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఎంతో మ‌హోత్కృష్ణ గ్రంథ‌రాశిని అందిస్తున్న విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మ‌హాయ‌జ్ఞ‌కేంద్రం ప్ర‌చురించిన శ్రీపూర్ణిమ

సింగర్ స్మిత సోషల్ అవేర్‌నెస్‌

సింగర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన స్మిత ఈ ఏడాదితో 20 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని 'గ్యాంగ్‌ లీడర్‌' టీజర్‌ రిలీజ్‌

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై

అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఔట్.. రోజా హ్యాపీ హ్యాపీ!!

నాడు ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజాను అధికారపక్షం ఏడాదిపాటు సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే.

'RRR' లో ఎన్టీఆర్‌కు ప్రేయ‌సి చిక్కిన‌ట్టేనా?

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ మూవీస్‌లో ఒక‌టిగా రూపొందుతోన్న చిత్రం `RRR`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌గా..