'భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరు' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

సంపూర్ణేష్‌బాబు, చరణ్‌, రాజ్‌, రోషన్‌, హమీదా ప్రధాన తారాగణంగా ముల్లపూడి రామ్‌జీ సమర్పణలో సాయివెంకట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, మారుతి టీం వర్క్స్‌ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం భద్రమ్‌ బి కేర్‌ ఫుల్‌ బ్రదరు'. రాజేష్‌ పులి దర్శకత్వంలో బోనం కృష్ణ సతీష్‌, అడగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ ఈ చిత్రాన్ని రూపొందించారు. యంగ్ హీరో నిఖిల్ మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో టీజర్ ను విడుదల చేశారు.

కొంత మందికి అవకాశాలు ఉపయోగించుకోవడం తెలియదు. భ్రదమ్ బి కేర్ ఫుల్ సినిమా యూనిట్ ను చూస్తే అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. నిర్మాతలు నాకు మంచి మిత్రులు. సినిమా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని ప్రముఖ దర్శక నిర్మాత మారుతి తెలియజేశారు.

ప్రేక్షకులు ఆదరించిన సినిమాలే పెద్ద సినిమాలు, మంచి సినిమాలు అవుతాయి. మారుతిగారు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. టీజర్ బావుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయి ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు మంచి పేరు తీసుకురావాలని హీరో నిఖిల్ అన్నారు.

ఇది నా రెండో సినిమా. మారుతిగారు, నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరూ బాగా సపోర్ట్‌ చేస్తున్నారు. అందరికీ థాంక్స్ అని దర్శకుడు రాజేష్ పులి అన్నారు.

మారుతిగారు కథ ఓకే చెయ్యగానే సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. మారుతిగారు ఈ సినిమా విషయంలో ఫుల్ సపోర్ట్ చేశఆరు. రీసెంట్ గా భలే భలే మగాడివోయ్‌, కుమారి 21 ఎఫ్‌ వంటి చిన్న చిత్రాలు పెద్ద హిట్ అయ్యాయి అలాగే ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్‌ను సాధిస్తుందని నిర్మాత బోనం కృష్ణ సతీష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో చరణ్‌, రాజ్‌, రోషన్‌, హమీదా సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు.

సత్యం రాజేష్‌, సూర్య, ప్రభాస్‌ శ్రీను, వేణుగోపాల్‌, సారిక రామచంద్రరావు, జ్యోతి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్‌ జోషి, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, సంగీతం: జెబి, నిర్మాతు: బోనం కృష్ణ సతీష్‌, అడగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ, దర్శకత్వం: రాజేష్‌ పులి.

More News

లోఫర్ రన్ టైమ్ ఇదే..

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లోఫర్.వరుణ్ తేజ్ సరసన దిశా పటాని నటించింది.ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.

ఆ డైరెక్టర్ కి మళ్లీ పవన్ అవకాశం ఇస్తున్నాడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...గతంలో అవకాశం ఇచ్చిన ఓ డైరెక్టర్ కి మళ్లీ అవకాశం ఇస్తున్నాడు.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..?

బెజ‌వాడ అవ్వ చివ‌రి కోరిక తీర్చిన బన్ని

బెజ‌వాడ అవ్వ మ‌స్తాన్ బీ కి కీ.శే అల్లు రామ‌లింగ‌య్య అంటే అభిమానం. ఆయ‌న్ని క‌ల‌వాల‌నుకుంది. కానీ క‌ల‌వ‌లేక‌పోయింది.

మెగాఫ్యామిలీలో వరుణ్ పెద్ద స్టార్ అవుతాడు - కళ్యాణ్

‘ముకుంద’,‘కంచె’వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా

టెన్షన్ లో రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం నేను శైలజ.ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించాడు.స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.