'బగ్గిడి గోపాల్' షూటింగ్ ప్రారంభం!

  • IndiaGlitz, [Friday,January 19 2018]

బ‌గ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బ‌గ్గిడి గోపాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తోన్న బ‌యోపిక్ 'బ‌గ్గిడి గోపాల్'. రైటు రైటు టు అధ్య‌క్షా అనేది క్యాప్ష‌న్. మ‌హేష్‌, భ‌వ్య‌శ్రీ, శ్వేతారెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా అర్జున్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా, టిఎప్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణగౌడ్ కెమెరా స్విచాన్ చేశారు.

సాయి వెంక‌ట్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే , న‌టుడు, నిర్మాత బ‌గ్గిడి గోపాల్ మాట్లాడుతూ...''ఒక సామాన్య ఆర్టీసీ కండ‌క్ట‌ర్ అయిన నేను శాస‌న స‌భ్యుడుగా ఎలా ఎదిగాను అనేది ఒక‌టో పార్ట్ గా చిత్రీక‌రిస్తున్నాం. ఆక‌లి తెలిస‌న వాడు ఎమ్మెల్యే అయితే ప్ర‌జ‌ల‌కు ఎలా సేవ చేస్తాడు, శాస‌స స‌భ‌లో ఎదుర్కొన్న స‌వాళ్లు, కొంత మంది వ‌ల్ల నా ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్న‌ది రెండో పార్ట్ లో చూపిస్తున్నాం. ఇలా నా జీవితం విద్యార్ది ద‌శ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మ‌లుపుల‌తో సాగింది. ఇవన్నీ ఈ చిత్రంలో పొందు ప‌రిచాము. నా లైఫ్ హిస్ట‌రీని సినిమాగా చేయ‌డం మా ద‌ర్శ‌కుడు దాన్ని అద్భుతంగా త‌యారు చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య వ‌చ్చి మా యూనిట్ ను ఆశీర్వ‌దించ‌డం చాలా ఆనందంగా ఉందన్నారు.

టిఎఫ్ సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...''బగ్గిడి గోపాల్ గారి లైఫ్ హిస్ట‌రీని సినిమా తీయ‌డం గొప్ప విష‌యం. క‌థ విన్నాను. ద‌ర్శ‌కుడు చాలా అద్భుతంగా స‌హ‌జ‌సిద్దంగా త‌యారు చేశాడు. ఇటీవ‌ల కాలంలో బ‌యోపిక్ చిత్రాలు పెద్ద స‌క్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ అవ‌డం ఖాయం. రెండు పార్ట్ లు గా రూపొందుతున్న ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ కావాల‌న్నారు.

త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య మాట్లాడుతూ...'' బ‌గ్గిడి గోపాల్ లైఫ్ హిస్ట‌రీ తో వ‌స్తోన్న ఈ చిత్రం బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా. బ‌గ్గిడి గోపాల్ తొలి ప్ర‌య‌త్నం ఫ‌లించాల‌ని ఆశిస్తున్నా. బ‌గ్గిడి గోపాల్ శాస‌న స‌భ్యులుగా ఉన్న‌ప్పుడు నేను కూడా శాస‌న స‌భ స‌భ్యుడిగా ఉండేవాణ్ని. త‌రుచుగా క‌లిసేవాళ్లం. ఆయ‌న్ను దీవిస్తూ ఇలాంటి మ‌రెన్నో చిత్రాలు చేయాల‌న్నారు.

ద‌ర్శ‌కుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ..''నేను ప్ర‌స్తుతం వేరే చిత్రం చేస్తున్నా. అందులో బ‌గ్గిడి గోపాల్ గోపాల్ గారు విల‌న్ రోల్ లో న‌టిస్తున్నారు. నా వ‌ర్క్ న‌చ్చి బ‌గ్గిడి గోపాల్ గారి బ‌యోపిక్ ని సినిమాగా చేసే అవ‌కాశం క‌ల్పించిన బ‌గ్గిడి గోపాల్ గారికి ధ‌న్య‌వాదాలు'' అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్ని వ్యక్త ప‌రిచారు.

బ‌గ్గిడి గోపాల్, రెడ్డ‌ప్ప రెడ్డి (ఆర్ ఆర్‌), మ‌హేష్‌, భ‌వ్య‌శ్రీ, శ్వేతారెడ్డి, క‌విత‌, సుమ‌న్, రామ‌కృష్ణ గౌడ్, ఎల్ బి శ్రీరాం, జ‌బ‌ర్ద‌స్త్ అండ్ గబ్బ‌ర్ సింగ్ రౌడీస్ న‌టిస్తున్న ఈ చిత్రానికి మేనేజ‌ర్ః రెడ్డ‌ప్ప రెడ్డి, కో-డైర‌క్ట‌ర్ః సివి ముర‌ళి; అసోసియేట్ః అన్వేష్ పూరి, కెమెరాః ఎ.ప్ర‌వీణ్ కుమార్; స‌ంగీతంః జ‌య‌సూర్య‌; ఆర్ట్ః మ‌నోజ్ కుమార్; నిర్మాతః బ‌గ్గిడి గోపాల్; ద‌ర్శ‌కత్వంః అర్జున్ కుమార్‌.​

More News

'టిక్ టిక్ టిక్' ట్రైలర్ ను విడుదల చేసిన సాయిధరమ్ తేజ్

జయం రవి,నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో

అనుష్కకి విలన్ గా..

అరుంధతి,బాహుబలి చిత్రాల తరువాత మరోసారి అభినయానికి అవకాశమున్న పాత్రలో అనుష్క నటిస్తున్న చిత్రం భాగమతి.

రామ్ చరణ్ కి అత్త కాదట

బుల్లితెర సంచలనం అనసూయ..వెండితెర పైనా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

రెగ్యులర్‌ షూటింగ్‌లో రామ్‌చరణ్‌, బోయపాటి భారీ చిత్రం

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో  కొత్త చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయ్యింది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డ‌బ్బింగ్ చెప్పుకున్న ర‌ష్మిక‌

న‌వ‌త‌రం క‌థానాయిక‌లు త‌మ పాత్ర‌ల‌కి తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్యా మీన‌న్ లాంటి క‌థానాయిక‌లు అయితే.. కేవ‌లం త‌మ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా త‌మ స‌హ‌న‌టికి కూడా డ‌బ్బింగ్ చెప్పిన సంద‌ర్భాలున్నాయి.