close
Choose your channels

'RRR' ఫ్లైట్ లో బాహుబలి నిర్మాత.. రాంచరణ్ సెల్ఫీ వైరల్

Wednesday, August 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్ఆర్ఆర్ టీం ఫైనల్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో రాజమౌళి ప్రధాన తారాగణం ఎన్టీఆర్, రాంచరణ్, అలియా భట్ పై భారీ సాంగ్ ని చిత్రీకరించనున్నారు. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ సాంగ్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుందట.

ఈ సాంగ్ చిత్రీకరణతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక కేవలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ వెళుతున్న సమయంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ టీంతో ఫ్లైట్ లో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సెల్ఫీ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సెల్ఫీలో చరణ్ గాగుల్స్ ధరించి డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పిక్ లో రాంచరణ్ తో పాటు నిర్మాత డివివి దానయ్య, వల్లి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి, డాక్టర్ గురవా రెడ్డి లని చూడవచ్చు.

ఇక చరణ్ తన సతీమణి ఉపాసనతో ప్రత్యేకంగా మరో సెల్ఫీ తీసుకున్నాడు. రాంచరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీంపాత్ర చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో, దోస్తీ సాంగ్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజమౌళి కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. చరణ్ ని నిప్పు, ఎన్టీఆర్ ని నీరు రెండు ఆపోజిట్ ఫోర్స్ లుగా రాజమౌళి ముందు నుంచి ప్రమోట్ చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.