close
Choose your channels

ప్ర‌భాస్ 'జాన్' లో బాహుబలి సెంటిమెంట్

Saturday, November 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ళ్లీ అలాగే ప్ర‌భాస్‌

బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. త‌ర్వాత విడుద‌లైన సాహోతో ఓకే అనిపించుకున్నాడు. ఇప్పుడు త‌దుప‌రి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా `జాన్‌`(విన‌ప‌డుతున్న టైటిల్‌) సినిమా తెర‌కెక్కుతుంది. గోపీకృష్ణా మూవీస్‌, యు.వి.క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను కూడా తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. అయితే `సాహో` విష‌యంలో నిర్మాత‌లు బ‌డ్జెట్ విష‌యంలో చేసిన త‌ప్పులను మ‌ళ్లీ చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నార‌ట‌. అందుకు భారీ చిత్ర‌మే అయినా జాగ్ర‌త్త‌ల‌తోనే జాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

1970 బ్యాక్‌డ్రాప్‌లో యూర‌ప్‌లో జ‌రిగే ల‌వ్‌స్టోరీ ఇది. ప్ర‌స్తుతం ఆ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అందుకోసం స్పెష‌ల్ సెట్స్ కూడా వేస్తున్నార‌ట‌. కాగా లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు కూడా `బాహుబ‌లి` సెంట‌మెంట్‌నే ప్ర‌భాస్ ఫాలో అవుతున్నాడ‌ని టాక్‌. ఇంత‌కు ప్ర‌భాస్ ఏ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడో తెలుసా? త‌ండ్రీ కొడుకులుగా న‌టించ‌డం. బాహుబ‌లిలో తండ్రీ కొడుకులుగా న‌టించిన ప్ర‌భాస్‌.. జాన్ సినిమాలోనూ తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌బోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.