బాలయ్య 106లో .. హీరోయిన్‌ ఛేంజ్‌

  • IndiaGlitz, [Saturday,November 21 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా అంటే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పెద్ద ఛాలెంజ్‌, ఆయ‌న‌కు స‌రైన జోడీని ఫిక్స్ చేయ‌డ‌మే. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌కు త‌గ్గ హీరోయిన్ దొర‌క‌డం లేద‌నే వార్త‌ల‌ను మ‌నం వింటూనే ఉన్నాం. ఈ కోవ‌లో హీరోయిన్ సెట్ కావ‌డానికి బాల‌య్య కూడా స‌మయం ప‌డుతూనే ఉంది. ఇప్పుడు బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ త‌ర్వాత సినిమా ఇటీవ‌ల పునః ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎట్టకేలకు క్లారిటీ వచ్చిందని అందరూ అనుకుంటే .. ఉన్నట్లుండి మార్పు జరిగింది. వివరాల్లోకెళ్తే ఎన్‌బీకే 106లో హీరోయిన్‌గా సయేషా సైగల్‌ను అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో హీరోయిన్‌ మారిందట. సయేషా స్థానంలో ప్రగ్యా జైశ్వాల్‌ చేరిందని సమాచారం. ఆమె షూటింగ్‌లో పాల్గొందని వార్తలు వినిపిస్తున్నాయి.

సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంత సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌య్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ జ‌రుగుతోంది. ఇందులో బాల‌కృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.  అందులో ఓ పాత్ర అఘోరా అని తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

‘లూసిఫ‌ర్’ రేసులో మ‌రో డైరెక్ట‌ర్‌..?

మ‌లయాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ‘లూసిఫ‌ర్’ చిత్రాన్ని ఏ ముహూర్తాన రీమేక్ చేయాల‌ని చిరంజీవి నిర్ణ‌యించుకున్నారో ఏమో కానీ..

అక్క ఇచ్చిన బూస్ట్‌ని బాగా వంట పట్టించుకున్న మోనాల్..

ఓపెనింగే.. జున్ను ఎంట్రీ.. కొడుకును చూసి లాస్య ఆనందంతో పొంగిపోయింది. లాస్య భర్త మంజునాథ్ ఆమెకు చాలా ధైర్యం చెప్పారు.

టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల..

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లను నేడు తుది గడువు కావడంతో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేసింది.

రహస్య వివాహం చేసుకున్న ప్రభుదేవా...?

యాక్టర్‌, కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ అయిన ప్రభుదేవా పెళ్లి అయిపోయిందా? అంటే అవుననే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఎన్నికల బరిలో కరోనా..

టైటిల్ చూడగానే.. ఓహో ఎన్నికల్లో పోటీ చేసే వారు ప్రచారం పేరుతో తమ అనుచరలతో హల్ చల్ చేస్తున్నారు కాబట్టి ఇంకేంముంది కరోనా విజృంభిస్తోంది