close
Choose your channels

బాల‌య్య 107కి డైరెక్ట‌ర్ అత‌నేనా?

Friday, July 31, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌య్య 107కి డైరెక్ట‌ర్ అత‌నేనా?

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడు మీదున్నారు. ఎందుకంటే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ఇప్పుడు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 106వ సినిమాలో బాల‌కృష్ణ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే బాల‌కృష్ణ ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఇప్పుడు బాల‌య్య‌ను డైరెక్ట్ చేయ‌బోయే త‌దుప‌రి సినిమా డైరెక్ట‌ర్స్ లిస్టులో యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి చేరార‌ట‌.

నిజానికి ఇంత‌కు ముందే బాల‌కృష్ణ‌ను అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయాల్సింది. బాల‌కృష్ణ‌తో ‘రామారావుగారు’ అనే సినిమాను డైరెక్ట్ చేయాల్సిన తరుణంలో ప్రాజెక్ట్ ఎందుకనో పట్టాలెక్కలేదు. ఇప్పుడు అనీల్ రావిపూడి తన సూపర్‌హిట్ మూవీ ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’కి సంబంధించిన స్క్రిప్టును సిద్ధం చేశారు. కానీ క‌రోనా కార‌ణంగా వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ వారి క‌మిట్ మెంట్ చిత్రాల‌ను పూర్తి చేయ‌క‌పోవ‌టంతో ఈ సీక్వెల్‌ను ఇప్పుడు అనీల్ రావిపూడి తెర‌కెక్కించ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టంతో బాల‌య్య‌తో సినిమా చేయ‌డానికి అనీల్ రావిపూడి మ‌రోసారి ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. బాల‌య్య కూడా సుముఖుంగానే ఉన్నార‌ట‌. అంతా కుదిరితే బోయ‌పాటి శ్రీను సినిమా త‌ర్వాతే బాల‌కృష్ణ, అనీల్ రావిపూడి కాంబోలో సినిమా ఉంటుంద‌ని, ఆ త‌ర్వాతే బి.గోపాల్ డైరెక్ష‌న్‌లో మూవీ ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై నంద‌మూరి క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.