ఒక్క అభిమాని దూరమైనా భరించలేను.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్

  • IndiaGlitz, [Monday,June 07 2021]

నందమూరి నటసింహం బాలయ్య తన అభిమానులని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అభిమానుల్లో బాలయ్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలయ్య వెండి తెరపై సరైన మాస్ రోల్ లో కనిపిస్తే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అలాంటి తన ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: నటిని కాబట్టి నచ్చకపోయినా చేయాలి.. నిజంగానే ఆ పని చేసిన హీరోయిన్!

జూన్ 10న బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య తన ఫ్యాన్స్ కి ఓ విన్నపం తెలియజేశారు. 'నా ప్రాణ సమానులైన అభిమానులకు.. ప్రతి ఏటా జూన్ 10న నా పుట్టిన రోజు నాడు నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి అభిమానులు వస్తుంటారు. మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం ..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు,  మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు.  మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక .. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ .. మీ నందమూరి బాలకృష్ణ' అని బాలయ్య సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేశారు.

ప్రస్తుతం కరోనా సమయంలో తమపుట్టిన రోజునాడు ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని హీరోలు తమ అభిమానులకు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టిన రోజునాడు తన కొత్త చిత్రాల ప్రకటన వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

More News

నటిని కాబట్టి నచ్చకపోయినా చేయాలి.. నిజంగానే ఆ పని చేసిన హీరోయిన్!

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.

'పంచతంత్రం'లో సుభాష్‌గా రాహుల్ విజయ్... అతని పుట్టినరోజు ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.

'పీవీ నరసింహారావు' పేరుతో కొత్త జిల్లా.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్?

10 జిల్లాల తెలంగాణాని కేసీఆర్ 33 జిల్లాలుగా మార్చారు. తెలంగాణాలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతున్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది.

రవితేజ కథ మెగా హీరోకి సెట్ అవుతుందా ?

నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, సినిమా చూపిస్త మావ లాంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకులు త్రినాథ్ రావు నక్కిన.

శర్వానంద్ సినిమాపై నితిన్ డౌట్.. అందుకే పక్కన పెట్టేశాడా ?

గత ఏడాది నితిన్ భీష్మ చిత్రంతో హిట్ కొట్టాడు. నితిన్ కెరీర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది అనుకుంటున్న తరుణంలో ఈ ఏడాది 'చెక్' తో నితిన్ కి షాక్ తగిలింది.