close
Choose your channels

బాలయ్య దెబ్బకు ఇంగ్లండ్ వరల్డ్‌ కప్ గెలిచిందా!!

Wednesday, July 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలయ్య దెబ్బకు ఇంగ్లండ్ వరల్డ్‌ కప్ గెలిచిందా!!

టైటిల్ చూడగానే ఆశ్చర్యమేస్తోంది కదూ..? అసలు బాలయ్యకు-ఇంగ్లండ్ వరల్డ్ కప్‌ గెలవడానికి ఏమైనా సంబంధం ఉందా..? బాలయ్య ఎక్కడా..? ఇంగ్లండ్ టీమ్ ఎక్కడ..? అని అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే కానీ ఇది రియల్ కాదు.. రీల్‌లో మాత్రమే.

నువ్వా నేనా..? అని నరాలు తెగే ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించి వరల్డ్ కప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. చివరి వరకూ న్యూజిలాండ్‌దే గెలుపు అని అందరూ అనుకున్నారు.. కానీ సూపర్ ఓవర్‌తో సీన్ రివర్స్ అయ్యింది. ఈ తరుణంలో నందమూరి బాలయ్య సినిమా డైలాగ్ తెగ పాపులర్ అవుతోంది. ‘అధినాయకుడు’ సినిమాలో క్రికెట్ గురించి బాలయ్య.. ఓ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇండియా గొప్పతనమేంటో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ చెబుతారు.

బాలయ్య: ‘హోల్డ్ యువర్ టంగ్.. నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడివి!

ఎదుటి వ్యక్తి : నేను ఇంగ్లాండ్ దేశస్థుడిని

బాలయ్య: క్రికెట్ ఏ దేశంలో పుట్టింది..?

ఎదుటి వ్యక్తి: అది కూడా తెలియదా మీకు.. మా దేశంలోనే క్రికెట్ పుట్టింది

బాలయ్య: ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచిందా!?

ఎదుటి వ్యక్తి : నో రెస్పాన్స్.. (దీంతో ఆ సభలోనూ ఇండియన్స్ అందరూ నవ్వుకుంటారు)

ఇక అసలు విషయానికొస్తే.. ఇంగ్లండ్ గెలిచిన తర్వాత బాలయ్య మాట్లాడిన ఈ మాటలే సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇదిగో బాలయ్య ఏదో ప్లోలో అలా అంటే ఇంగ్లండ్ మాత్రం సీరియస్‌గా తీసుకుని వరల్డ్ కప్ గెలుచుకుందని బాలయ్య అభిమానులు, నెటిజన్లు మరోవైపు సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ.. ఈ 30 సెకన్లు వీడియోను వాట్సాప్ స్టేటస్‌లలో సైతం పెట్టుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. బాలయ్య దృష్టికి ఈ విషయం వెళితే తెగ నవ్వుకుంటారేమో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.