శాతకర్ణి విజయం మరింత బాధ్యత పెంచింది - బాలకృష్ణ..!

  • IndiaGlitz, [Thursday,January 12 2017]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌, శ్రియ‌, క్రిష్ ఐమ్యాక్స్ లో సంద‌డి చేసారు.
ఐమ్యాక్స్ లో ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో బాల‌య్య మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల‌తో పాటు విదేశాల్లో కూడా ఈ చిత్రానికి అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. ఈ చిత్రాన్ని 79 రోజుల్లో పూర్తి చేసిన డైరెక్ట‌ర్ క్రిష్ కు, చిత్ర నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను. ఏపీ సి.ఎం చంద్ర‌బాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఈ చిత్రాన్ని విజ‌య‌వాడ‌లో వీక్షించ‌నున్నారు. నాన్న గారు చేయాలి అనుకున్న పాత్ర నేను చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అజ‌రామ‌రంగా నిలుస్తుంది. ఈ విజ‌యం నా పై మ‌రింత బాధ్య‌త పెంచింది అని అన్నారు.

More News

శతమానం భవతి కొత్త కథ కాదు కానీ....అది మాత్రం గ్యారెంటీ - శర్వానంద్..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా....ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో శర్వానంద్.

నాగార్జున మ‌రో భ‌క్తిర‌స చిత్రం..!

అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి చిత్రాల త‌ర్వాత న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున న‌టించిన మ‌రో భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు.

బాల‌య్య శాత‌క‌ర్ణి గురించి మెగాహీరో ట్వీట్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ నుంచి సినీ ప్ర‌ముఖులు బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం అద్భుతంగా ఉంది

ఓవ‌ర్ సీస్ లో ఖైదీ నెం 150 సంచ‌ల‌నం..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుంది.

ఈరోజు మధ్యాహ్నం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ని వీక్షించనున్న కె.సి.ఆర్

తెలుగుజాతి ఖ్యాతిని చాటి చెప్పిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితగాథ బాలకృష్ణ హీరోగా తెరకెక్కింన సంగతి తెలిసిందే.