చిరంజీవి సోదరిగా బాలయ్య హీరోయిన్?

ఆచార్య పూర్తయ్యాక మెగాస్టార్ చిరంజీవి మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో నటించబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అలాగే నటీనటుల ఎంపికపై కూడా ఫోకస్ పెట్టారు.

తాజాగా ఈ చిత్రం గురించి వినిపిస్తున్న ఓ గాసిప్ ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ విద్యాబాలన్ తో సంప్రదింపులు మొదలు పెట్టిందట.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి విద్యాబాలన్ అడుగుపెట్టడం ఖాయం అని అంటున్నారు. విద్యాబాలన్ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు అంగీకరిస్తున్నారు. అందుకే ఎక్కువగా ఆమె లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. బోల్డ్ రోల్ అయినా వెనుకడుగు వేయరు.

విద్యాబాలన్ తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య సరసన నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఎన్టీఆర్ సతీమణి పాత్రలో ఆమె సెట్ అయ్యారనే కామెంట్స్ వినిపించాయి.

More News

ఫ్యామిలీ మ్యాన్ 2 (వెబ్ సిరీస్) రివ్యూ

2019లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తొలి సీజన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే దర్శత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.

స్వీట్ షాక్ : క్రేజీ డైరెక్టర్ తో హీరోయిన్ పెళ్లి.. అంతా సడెన్ గా..

హీరోయిన్ యామి గౌతమ్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. క్రేజీ డైరెక్టర్ తో ఆమె పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది.

నన్ను దూరం పెడుతున్నావా అని బాలుగారు కోపంగా అన్నారు : చిరంజీవి

గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. గత ఏడాది ఆయన మరణించిన సంగతి తెలిసిందే.

శృంగార వీడియో వైరల్.. పోలీసులని ఆశ్రయించిన నటి

గత కొన్ని రోజులుగా సామజిక మాధ్యమాల్లో ఓ అశ్లీల వీడియో వైరల్ గా మారింది.

పీటల మీద పెళ్లి ఆగిపోతే.. ఫ్రస్ట్రేషన్ లో 'ఏక్ మినీ కథ' హీరో!

ప్రస్తుతం యువ హీరో సంతోష్ శోభన్ పేరు బాగా వినిపిస్తోంది. బోల్డ్ అండ్ డిఫెరెంట్ కంటెంట్ 'ఏక్ మినీ కథ'తో మాయ చేశాడు.