అల్లూరి గెట‌ప్‌లో బాల‌య్య‌

  • IndiaGlitz, [Sunday,December 30 2018]

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ఎన్‌.బి.కె.ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. ఈ బ‌యోపిక్‌లో తొలి భాగం 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఈ సినిమా తొలి భాగంలో ఎన్టీఆర్ హీరోగా ఎదిగి ప్ర‌జ‌ల్లో హృద‌యాల్లో సుస్ధిర స్థానం సంపాదించుకున్న వైనాన్ని చూపించ‌బోతున్నారు. కాగా సినిమాల ప‌రంగా ఆయ‌న న‌టించిన హిట్ చిత్రాల్లో పాట‌ల‌ను, సన్నివేశాల‌ను కూడా చూపించ‌బోతున్నారు.

సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఎన్టీఆర్ పాత్ర‌ధారిగా న‌టిస్తోన్న బాల‌కృష్ణ దాదాపు 60 గెటప్స్‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. అందులో ఒక‌టి అల్లూరి సీతారామరాజు గెట‌ప్. ఈ లుక్‌ను నేడు విడుద‌ల చేశారు. తెలుగు ఇండ‌స్ట్రీలో అల్లూరి పాత్రలో న‌టించాల‌ని చాలా మంది హీరోలు అనుకున్నారు. అయితే అల్లూరి బ‌యోపిక్‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ న‌టించారు. 'మేజ‌ర్ చంద్ర‌కాంత్‌' చిత్రంలో దివంగ‌త ఎన్టీఆర్ అల్లూరి పాత్ర‌ధారి పాట‌లో కనిపించారు. సాధార‌ణంగా అల్లూరి అంటే తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ‌లే గుర్తొచ్చేంత‌లా వీరి ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇప్పుడు ఆ పాత్ర‌లో బాల‌య్య క‌నిపించ‌బోతున్నారు.

More News

కోన చెప్పిన స్టార్ అత‌నేనా?

బాలీవుడ్‌లో మినిమం బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన `బ‌రేలీ కీ బ‌ర్ఫీ` చిత్రం ఆర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి హిట్ చిత్రంగా నిలిచింది.

బాల‌య్య వ‌ద్దంటే.. వెంకీ ఎస్ చెప్పాడా

స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ చాలా కాలంగా సినిమా చేయ‌కుండా ఉన్నాడు. నిజానికి బాల‌కృష్ణ హీరోగా వినాయ‌క్ సినిమా చేయాల్సింది.

ఒత్తిడిలో ర‌ష్మిక ఏం చేస్తుందో తెలుసా?

ప‌నిలో ఎక్కువ‌గా మునిగి తేలే వారు ఒత్తిడికి గుర‌వుతుంటారు. ఆ ఒత్తిడిని దూరం చేసుకోడానికి ఒక్కొక్క‌రు ఒక్కో రీతిన ప్ర‌వ‌ర్తిస్తుంటారు.

'మ‌జిలి' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి మజిలీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి దేర్ ఈజ్ ల‌వ్..

నందమూరి సుహాసిని భవితవ్యంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

నందమూరి సుహాసిని.. గత ఎన్నికల ముందు వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కూకట్ పల్లి స్థానానికి టీడీపీ తరపున అనూహ్యంగా చంద్రబాబు ఈమెను బరిలో దింపి ఆశ్చర్యపరిచారు.