బాలయ్య సినిమాకు ముహూర్తం కుదిరింది....

  • IndiaGlitz, [Thursday,July 06 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ చాలా వేగంగా సినిమాల‌ను పూర్తి చేసేస్తున్నాడు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 101వ సినిమా 'పైసా వ‌సూల్‌' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న బాల‌య్య 102వ సినిమాను స్టార్ట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, ఎన్నో ముత్తు, న‌ర‌సింహా వంటి ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను అందించిన కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు.

సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలైలో లాంఛ‌నంగా సినిమా ప్రారంభం అవుతుంద‌ని అనుకున్నారు కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను ఆగ‌స్టు 2న ప్రారంభిస్తార‌ట‌. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించ‌నుంది. గ‌తంలో శ్రీరామరాజ్యం, సింహా సినిమాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార క‌లిసి న‌టించ‌బోతున్న చిత్ర‌మిది.

More News

డైరెక్టర్ కూతురితో అఖిల్...

అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ అక్కినేని హీరోగా రెండో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి కావస్తుంది కానీ ఇంకా హీరోయిన్ ఎవరు ఫైనలైజ్ కాలేదు.

రామ్ చరణ్ స్థానంలో వరుణ్...

తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కిన 'తని ఒరువన్ 'సినిమాను తెలుగులో 'ధృవ'

చైనాలో కూడా ఓకేసారి....

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సైంటిఫికల్ విజువల్ వండర్ '2.0'.

దాసరి బయోపిక్...

టాలీవుడ్ లో దర్శకులకు ఓ గుర్తింపు తెచ్చిన వారిలో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఎప్పుడూ ముందుంటారు.

'నక్షత్రం' లో అలెగ్జాండర్ వంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు కృష్ణవంశీగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు - సాయిధరమ్ తేజ్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై