Balakrishna: ఇస్తాంబుల్లో #NBK107 టీం

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ #NBK107 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్ళింది. ఇక్కడ సినిమాలోని ప్రముఖ తారాగణంతో కీలక భాగాన్ని చిత్రీకరించనున్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని షూటింగ్ లొకేషన్ నుండి బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ ఎక్సయిట్ మెంట్ ఈ ముగ్గురిలో కనిపిస్తోంది. టాకీ పార్ట్ కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.

మేకర్స్ ఇటివలే బాలకృష్ణ పుట్టినరోజున రెండు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్‌లను అందించారు. ఫస్ట్ హంట్ వీడియో, ఆపై మాస్ పోస్టర్ విడుదల చేశారు. ఈ రెండింటికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

More News

Dhamaka: రవితేజ, శ్రీలీల 'ధమాకా' గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ "ధమాకా''.

Nenu Meeku Baaga Kavalsinavaadini: సెప్టెంబర్ 9న 'నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని' విడుదల

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ

తెలుగు లోగిళ్లలో ఏ ఇంట చూసినా.. ఏ న్యూస్‌ వీక్షించాలన్నా.. ఇప్పుడు ఎన్టీవీ.. అంతలా తెలుగు వీక్షకులు ఎన్టీవీతో కనెక్ట్‌ అయ్యారు..

Conductor Jhansi : శ్రీదేవి డ్రామా కంపెనీని షేక్ చేసిన లేడీ కండక్టర్.. కంటతడి పెట్టించిన లైఫ్‌ స్టోరీ

ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతోమంది ప్రతిభావంతులను

Vishal: విశాల్ 'మార్క్ ఆంటోని' ఫస్ట్ లుక్

వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం "మార్క్ ఆంటోనీ".