close
Choose your channels

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా బాలయ్య ఇల్లు!

Saturday, February 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా బాలయ్య ఇల్లు!

సినీ ఇండస్ట్రీలో ఎవరేం చేసినా విచిత్రమే. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ప్రజలకు ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం నటరత్న నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తాజాగా బాలయ్య ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయం ఆయన అభిమానులతో పాటు ఇతర ప్రజానీకానికి చాలా ఆసక్తికరంగా మారింది. ఎక్కడ తీసుకున్నారు? ఎంతకు తీసుకున్నారు? ఎవరి పేరు మీద కొన్నారు? అంటూ సోషల్ మీడియా జోరుగా చర్చ నడుస్తోంది.

నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తాజాగా ఓ ఇంటిని కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్‌ అంటేనే అత్యంత ఖరీదైన ప్రాంత్రం. ఆ ప్రాంతానికి చెందిన ఖరీదైన ప్రాంతమైన రోడ్ నంబర్ 1లో రూ.15 కోట్లకు ఓ ఇంటిని ఈ నెల 11వ తేదీన బాలయ్య కొనుగోలు చేశారని సమాచారం. రెండంతస్థులు కలిగిన ఆ ఇంటిని బాలయ్య తన భార్య వసుంధర పేరు మీద రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. 9,395 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ ఇల్లు ఉన్నట్టు సమాచారం.

ఆ ఇంటి కోసం బాలయ్య రూ. 7.5లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు, రూ. 82.5లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మనీ కంట్రోల్ అనే ఫైనాన్షియల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. చాలా ఖరీదైన ఈ ఇంటి కోసం బాలకృష్ణ గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నారని సమాచారం. మరోవైపు బాలయ్య సినిమాల్లో సైతం బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్‌లో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ చిత్రానికి `గాడ్‌ఫాదర్` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.