close
Choose your channels

ఆకట్టుకుంటున్న బాలకృష్ణ కొత్త లుక్

Tuesday, August 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆకట్టుకుంటున్న బాలకృష్ణ కొత్త లుక్

నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. గడ్డం, మీసం ఉన్న లుక్‌లో బాలయ్యను చూసి వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. మంగళవారం నుండి లోకల్ ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతుంది.

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.