ఆక‌ట్టుకుంటున్న బాల‌య్య స‌రికొత్త లుక్

  • IndiaGlitz, [Saturday,March 21 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ నెల‌లోనే రెండో షెడ్యూల్‌ను ప్రారంభించాల్సింది. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో షెడ్యూల్ వాయిదా ప‌డింది. వ‌చ్చే నెల మొద‌టి వారంలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యంలో న‌టిస్తున్నారు. అందులో ఓ గెట‌ప్‌కి సంబంధించిన లుక్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. చిన్న‌పాటి జుట్టు, గుబురు మీసాల‌తో బాల‌య్య లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అలాగే మ‌రో గెట‌ప్‌లో బాల‌య్య అఘోరా పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకోనున్నారు. అంజ‌లి ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్ పాత్ర‌లో శ్రియాశ‌ర‌న్ లేదా పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్ర‌మిది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వార‌ణాసి, రాయ‌ల‌సీమ నేప‌థ్యాలలో సినిమా ప్ర‌ధానంగా సాగుతుంది. జ‌గ‌ప‌తిబాబు ఇందులో విల‌న్‌గా న‌టించ‌బోతున్నారు. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

More News

చేతులెత్తి దండం పెడుతున్నా సహకరించండి..: కేసీఆర్

ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారితోనే సమస్య. విదేశాల నుంచి రాష్ట్రానికి 20 వేల మందికి పైగా వచ్చారు. కరీంనగర్‌ ఘటన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన

మ‌ల‌యాళ రీమేక్‌లో న‌టించేది ఎవ‌రు?

మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్‌, బిజూ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్పన్ కోశియ‌మ్‌’. కేర‌ళ‌లో మంచి వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

'కరోనా'పై మీడియాకు ఏపీ సర్కార్ మార్గదర్శకాలు.. వార్నింగ్!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

'జనతా కర్ఫ్యూ' సందర్భంగా ఏపీలో బస్సులు బంద్

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. రేపు అనగా ఆదివారం దేశ వ్యాప్తంగా

మార్చి 31వరకు సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఉండవ్!

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజానీకాన్ని గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు 250కు పైగా దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. తెలుగు రాష్ట్రాలకూ పాకింది. రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా అనుమానిత కేసులు