బాల‌య్య ద్వితీయార్థం బిజీ బిజీ

  • IndiaGlitz, [Saturday,March 17 2018]

ఈ ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’తో ప‌ల‌క‌రించి విజయాన్ని అందుకున్నారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు నందమూరి బాలకృష్ణ.  ప్రస్తుతం ‘యన్.టి.ఆర్’ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారాయ‌న‌. త‌న తండ్రి, మహానటుడు ఎన్టీఆర్ పాత్ర‌లో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు. ఈ నెల 29న లాంఛనంగా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ఆగ‌స్టు నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని.. ఈ లోపు  తేజ.. వెంకటేష్‌తో చేయబోతున్న సినిమాపై దృష్టి సారిస్తార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లోపు బాలకృష్ణ కూడా.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమాని ప్రారంభించ‌నున్నార‌ట‌.

రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని.. బాలకృష్ణ 58వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఆరంభించనున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల సమయానికి విడుదల చేయడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాల‌య్య‌, బోయ‌పాటి కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఘనవిజయం సాధించడంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే  ప్రస్తుతం బోయపాటి.. రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా పూర్తైన వెంటనే (ఆగష్టు నుంచి) బాలకృష్ణ సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే.. ‘జై సింహా’తో విజయాన్ని అందించిన నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణంలో బాలయ్య ఓ సినిమా చేస్తానని ఇప్పటికే మాటిచ్చారు. ఈ చిత్రానికి దర్శకుడిగా పూరి జగన్నాథ్, ఎస్.వి.కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ చిత్రం కూడా ద్వితీయార్ధంలోనే  సెట్స్ పైకి వెళ్ళే సూచనలు ఉన్నాయి. మొత్తానికి.. 2018 ద్వితీయార్ధంలో బాలకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో.. సమాంతరంగా జరిగే షూటింగ్స్‌తో బిజీగా ఉండనున్నారన్న మాట.  

More News

ఆ మూడు సినిమాల్లో పాత్రలను వెల్లడించిన పూజా

2018.. అందాల తార పూజా హెగ్డేకి చాలా ప్రత్యేకమనే చెప్పాలి.

'రంగ‌స్థ‌లం' అంద‌రికీ న‌చ్చుతుంది..మిస్ అవ్వొద్దు: రామ్ చ‌ర‌ణ్

ప్ర‌ముఖ  ఐటీ కంపెనీ వర్చ్యూసా 'ది జోష్2018-అవ‌ర్ యాన్యువ‌ల్ ఎంప్లాయ్ ఎంగేజ్ మేంట్' (జోష్ ఫాంట‌సీ సెస‌న్-4)

'చిరు తేజ్ సింగ్' జీవిత చరిత్ర ఆధారంగా బాలల చిత్రం

నిర్మాత N.S NAIK గారి సహాయసహకారాలతో అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా. ఆనంద్ కుమార్ దర్శకత్వంలో తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డును నెలకొల్పిన గిరిజన బాలిక చిరుతేజ్ సింగ్ జీవిత చరిత్ర

ఏప్రిల్ 5 న 'ఆచారి అమెరికా యాత్ర' విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం ఏప్రిల్ 5 న విడుదల కానుంది.

ర‌వితేజ స‌ర‌స‌న ఎమ్మెల్యే?

ఎన్నిక‌లు రాబోతున్న వేళ ఎమ్మెల్యే, మంత్రి అనే ప‌దాలు విన‌గానే వాటిని ఆధారంగా చేసుకునే క‌థ‌లు అల్లేసుకున్నారేమో అనే అనుమానం వ‌స్తుంది.