ఆ యంగ్ హీరోస్ కు బాలయ్య సపోర్ట్...

  • IndiaGlitz, [Saturday,July 01 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ యువ క‌థానాయ‌కుల‌కు త‌న స‌పోర్ట్ అందిస్తున్నారు. ఇంత‌కు ఎవ‌రా హీరోస్ అంటే నారారోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిస‌న్‌, ఆది. రాజేంద్ర ప్ర‌సాద్ కూడా సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌. సినిమాను జూలై 14న విడుదల‌వుతుంది.

సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజై మంచి టాక్‌ను రాబట్టుకుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుక‌ను జూలై 3న ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నార‌ట‌. ఇక్కొడ‌క విష‌య‌మేమంటే శ‌మంత‌క మ‌ణి నిర్మాత‌, బాల‌య్య 101వ చిత్రం నిర్మాత ఒక‌రే కావ‌డం. ఏదేమైనా కొత్త త‌రం హీరోల‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి బాల‌య్య ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌డం విశేష‌మే మ‌రి.