ఆల‌స్యమైంది.. కానీ ధ‌న్య‌వాదాలు చెప్పిన బాల‌య్య‌

  • IndiaGlitz, [Saturday,September 05 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ ఓ ప్ర‌ముఖ వ్య‌క్తికి ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు చెప్పారు. అయితే ఈ ధ‌న్య‌వాదాలు చెప్ప‌డంలో ఆల‌స్యం జ‌రిగింది కానీ.. బాల‌య్య మాత్రం ఆయ‌న‌కు థాంక్స్ చెప్పారు. ఇంత‌కూ బాల‌య్య నుండి థాంక్స్ అందుకున్న వ్య‌క్తి ఎవ‌రో కాదు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌. ఇంత‌కూ కేసీఆర్‌కు బాల‌య్య ఎందుకు ధ‌న్య‌వాదాలు చెప్పిన‌ట్లు. వివ‌రాల్లోకెళ్తే బాల‌కృష్ణ త‌న తండ్రి స్వ‌ర్గీయ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను పాఠ్యాంశంగా తెలంగాణ ప‌ద‌వ త‌ర‌గతిలో యాడ్ చేశారు. అయితే ఈ ప‌ని జ‌రిగి ఐదేళ్లు అవుతుంది. అయితే బాల‌కృష్ణ దృష్టికి ఈ విష‌యం ఇప్పుడే వెళ్లిందేమో కానీ.. త‌న ఫేస్ బుక్ ద్వారా బాల‌కృష్ణ ..ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు.

‘‘కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అని తెలిపారు బాల‌కృష్ణ‌.

More News

సెప్టెంబ‌ర్ 8న 'ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం' మొద‌టి పాట‌

యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం లేటెస్ట్ మూవీ ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 ఆడియో నుంచి మొద‌టి సింగిల్ విడుద‌ల

ఆసుపత్రి పాలైన మరో మాజీ సీఎం..

అసోం మాజీ సీఎంలు వరుసగా ఆసుపత్రి పాలవుతున్నారు. మాజీ సీఎం తరుణ్ గోగోయ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన ఇటీవల ఆసుపత్రి పాలయ్యారు.

నెపోటిజం బాలీవుడ్‌లో చాలా ఎక్కువ: సమీరారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘జై చిరంజీవ’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ చిత్రాల ద్వారా తెలుగు చిత్రసీమలో తనకంటూ మంచి నటిగా ముద్ర వేయించుకున్న హీరోయిన్ సమీరారెడ్డి.

మాధ‌వి ల‌త 'లేడీ' టీజ‌ర్ విడుద‌ల‌

టాలెంటెడ్ బ్యూటీ మాధవి లత హీరోయిన్ గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో లేడీ అనే సినిమా సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

ఒకేసారి నా ప్రయాణాన్ని గుర్తు చేశారు: పవన్

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన సినీ, మీడియా మిత్రులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.