'రైతు' కోసం బాలయ్య డేరింగ్....

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

సాధార‌ణంగా సీనియ‌ర్ హీరోస్ అందరూ వారి వ‌య‌సును త‌క్కువ‌గా చూపించుకుంటూ తెర‌పై యంగ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తుంటారు. పాత్ర‌ల కోసం ఏజ్డ్ పాత్ర‌లు చేసే హీరోస్ చాలా త‌క్కువ మంది ఉంటారు. ఈ త‌క్కువ మంది హీరోస్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. పాత్ర న‌చ్చితే దాని కోసం రిస్క్ చేయ‌డానికి బాల‌య్య రెడీ అయిపోతారు. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా త‌ర్వాత రైతు అనే పేరుతో కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే 70 సంవ‌త్స‌రాల రైతు పాత్ర‌లో బాల‌కృష్ణ ఈ చిత్రంలో క‌నిపిస్తార‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదో ర‌కంగా బాల‌య్య చేస్తున్న ప్ర‌యోగ‌మ‌నే చెప్పాలి. గ‌తంలో కూడా పెద్ద‌న్న‌య్య‌, అధినాయ‌కుడు సినిమాల్లో బాల‌య్య ఏజ్‌కు పై బ‌డ్డ పాత్ర‌ల్లో క‌న‌ప‌డ్డారు. అలాగే మ‌రోసారి బాల‌య్య సంద‌డి చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌. ఈ సినిమాలో బాల‌య్య గెట‌ప్‌పై ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ట‌.

More News

థ్రిల్ కలిగిస్తున్న‌ మ‌హిష్మ‌తి సామ్రాజ్యం..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రంలో మ‌హిష్మ‌తి సామ్రాజ్యాన్ని చూసి ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల‌య్యారు. ఇక బాహుబ‌లి 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవ‌ల బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

విశాల్ తో కీర్తిసురేష్....?

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి.

చైతు మూవీ రైట్స్ ద‌క్కించుకున్న టాప్ ప్రొడ్యూస‌ర్..!

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ ద‌స‌రా కానుక‌గా రిలీజై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ సంతోషంలో చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ సినిమా శాటిలైట్ హక్కులను సొంతంచేసుకున్న...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఆ వార్తల పై క్లారిటి ఇచ్చిన బ్రహ్మి..!

హస్య బ్రహ్మ బ్రహ్మానందం డైరెక్షన్ చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.