close
Choose your channels

ఆక్ట‌టుకుంటోన్న బాల‌కృష్ణ స‌రికొత్త లుక్‌

Monday, January 20, 2020 • తెలుగు Comments

ఆక్ట‌టుకుంటోన్న బాల‌కృష్ణ స‌రికొత్త లుక్‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106వ చిత్ర‌మిదే. య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు, రూల‌ర్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేదు. ఈ సినిమా విష‌యంలో బాల‌కృష్ణ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌టం లేదు. స్క్రిప్ట్ విష‌యంలో బోయ‌పాటిని కేర్ తీసుకోమ‌ని బాల‌య్య ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళుతుంద‌ని అనుకుంటున్న ఈ సినిమా ఆల‌స్య‌మ‌వుతుంది. తాజాగా.. బాలకృష్ణ కొత్త లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

గుండు కొట్టుకుని ఉన్న బాల‌య్య వైట్ అండ్ వైట్‌లో క‌న‌న‌ప‌డుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల్లోనూ బాల‌య్య సంద‌డి  చేస్తూ క‌నిపించారు. మ‌రి ఈ లుక్ సినిమా కోసమా?  లేక వ్య‌క్తిగ‌తంగానా? అని మాత్రం తెలియ‌డం లేదు. ఈ సినిమా కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు. మిర్యాల ర‌వీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాల‌కృష్ణ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌కుండానే బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలోనూ మ‌రో సినిమా చేయ‌డానికి బాల‌కృష్ణ స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని మ‌రో వైపు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz