close
Choose your channels

ఛీ.. ఛీ.. నేను మాట్లాడమేంటి : బాలయ్య

Tuesday, June 2, 2020 • తెలుగు Comments

ఛీ.. ఛీ.. నేను మాట్లాడమేంటి : బాలయ్య

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం.. ఇలా వివాదం ముదిరింది. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా ఓ ప్రముఖ యూ ట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున గారు సీఎం కేసీఆర్‌ గారిని వెళ్లి కలిశారు. దీనికి మిమ్మల్ని పిలవలేదు. గొడవలు జరుగుతున్నాయ్ కదా..? దీనికి మీరేమంటారు..!. కేసీఆర్ గారి మీద విమర్శలు చేశారని పిలవలేదా..? అని యాంకర్ ప్రశ్నించగా.. ఇందుకు బాలయ్య చాలా లాజికల్‌గా స్పందించారు.

వాళ్లకే తెలియాలి..!

‘అవునండీ.. కేసీఆర్‌ గారికి నా మీద ఎప్పుడు కోపం లేదు. అది రాజకీయాలు.. రాజకీయాలే. నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకోలా..?. కేసీఆర్‌ను ఆయన ఎన్ని తిట్లు తిట్టుంటాడు. రాజకీయాలు వేరు. అందుకే చెబుతున్నా హిప్పోక్రసీ, సైకో ఫ్యాన్సీ. నన్ను వేరుగా చేస్తే మాత్రం తిక్కరేగుతుంది. కేసీఆర్ గారికి నాపైన అలాంటిదేమీ లేదు. నాన్నగారు ఎన్టీఆర్ అభిమానిగా ఆయన.. నేనంటే పుత్ర వాత్సల్యం ఉంది. కేసీఆర్‌కు నా మీద అలాంటి అభిప్రాయం ఏమీ ఉండదు. ఎందుకు పిలవలేదో వాళ్లకే తెలియాలి. దేవుడున్నాడు.. ఒకప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చే మనం ఇప్పుడు ఎదురుపడినప్పుడు నమస్కారం (దండం) పెట్టుకోవాల్సి వస్తోంది. ఎవరైనా సరేనా మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోండి. నేను ఇది నాన్నగారి నుంచి నేర్చుకున్నాను’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.

నాగబాబు వ్యాఖ్యలపై..

‘నేనేం మాట్లాడలా.? ఆయనే నాగబాబే మాట్లాడుతున్నాడు. చీ.. ఛీ నేనేం మాట్లాడలేదు. నేను మాట్లాడటమేంటి..?. ఇప్పుడు మాట్లాడటానికి కూడా ఏముంది..?. ఇండస్ట్రీ అంతా ఆల్ మోస్ట్‌ ఇవాళ నాకు సపోర్టుగానే వస్తోంది.. మాట్లాడుతోంది. ఇక నేనెందుకు మాట్లాడాలి’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. కాగా భూముల గురించి ఇప్పుడు మాట్లాడాలని ఇంటర్వ్యూలో అడగ్గా.. అబ్బే ఇంకే మాట్లాడతాను అన్నట్లుగా తల అలా అలా ఊపిన బాలయ్య మిన్నకుండిపోయారు. కాగా ఇదే ఇంటర్వ్యూలో మల్టిస్టారర్ మూవీతో పాటు పలు ఆసక్తికర విషయాలను బాలయ్య పంచుకున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz