Balakrishna: 'హనుమాన్' సినిమాను చూసిన బాలకృష్ణ.. మూవీ యూనిట్‌పై ప్రశంసలు..

  • IndiaGlitz, [Wednesday,January 17 2024]

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన 'హనుమాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆంజనేయస్వామిని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈ చిత్రానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ జై హనుమాన్ అంటున్నారు. మూవీలోని వీఎఫ్‌క్స్, గ్రాఫిక్స్‌కు సలాం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే రూ.100కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ చిత్రం రూ.200కోట్ల క్లబ్ వైపు పరిగెడుతోంది. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ మూవీని కుటుంబసభ్యులతో కలిసి వీక్షించారు.

మూవీ చూసిన అనంతరం సినిమా కన్నువల పండుగలా ఉందని కొనియాడారు. మూవీలోని ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ప్రాణం పెట్టి చేసినట్లు స్క్రీన్‌పై కనిపిస్తుందని పేర్కొన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే 'హనుమాన్ 2' కోసం వెయిట్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య మూవీ తీయబోతున్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బాలయ్య.. హనుమాన్ మూవీ చూసి ప్రశాంత్‌ను అభినందించడంతో వీరి కాంబోలో మూవీ కన్ఫార్మ్ అనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్‌కుమార్, రిషబ్ శెట్టి కూడా హనుమాన్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సినిమా సూపర్బ్‌గా ఉందని.. ప్రశాంత్ వర్మ దర్శకత్వం మైండ్‌ బ్లోయింగ్ అని శివన్న కితాబు ఇచ్చారు. తేజ, వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా నటించారన్నారు. చివరి అరగంట గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. జై హనుమాన్ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు ప్రశాంత్ టేకింగ్, నిర్మాణ విలువలు, తేజ సజ్జ యాక్టింగ్ బాగున్నాయని రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు. అలాగే హీరోయిన్ సమంత కూడా మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించింది. చిత్ర బృందం అద్భుతమైన విజయాన్ని అందుకుందన్నారు. మొత్తానికి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన 'హనుమాన్' మూవీ ఇటు భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ దుమ్మురేపుతోంది.

More News

Chandrababu: అయోధ్యకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం

యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. జనవరి 22న జరిగే ఈ చారిత్రాత్మక వేడుకకు

Revanth Reddy: దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీజిజీ.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ..

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీగా గడుపుతోంది.

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేటి నుంచి విద్యుత్ కోతలు..

హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం షాకింగ్ వార్త అందించింది. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా హాయిగా గడుపుతున్న నగరవాసులకు ఉక్కపోత మొదలుకానుంది.

Naa Saami Ranga: అదరగొడుతున్న నాగార్జున.. 'నా సామిరంగ' మూడు రోజులు కలెక్షన్స్ ఎంతంటే..?

సంక్రాంతి పండుగకి కింగ్ నాగార్జున మరోసారి హిట్ కొట్టాడు. గతంలో సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు చిత్రంతో హిట్స్‌ కొట్టగా.. తాజాగా 'నా సామిరంగ' చిత్రంతోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అయింది.

Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఎక్స్(ట్విట్టర్)అకౌంట్ హ్యాక్‌ అయింది.