'చినబాబు'కి బాలు డ‌బ్బింగ్ చెప్పారా?

  • IndiaGlitz, [Wednesday,June 06 2018]

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. పరిచయం అక్కరలేని పేరు. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని దాదాపు అన్ని భాషల్లోనూ పాట‌లు పాడి.. తన గాత్ర మాధుర్యాన్ని దేశమంతటా శ్రోతలకు పంచిన అపూర్వ గాయకుడాయ‌న‌. సాధారణంగా.. బాలసుబ్రహ్మణ్యం పేరు చెబితే గాయకుడు మాత్రమే గుర్తుకు వస్తారు. నిజానికి ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, న‌టుడిగా.. ఇలా ప‌లు విభాగాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటే.. ‘ఆనంద భైరవి’ (1983) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం ప్రారంభించిన బాలు.. అనంతరం ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆ విభాగంలోనూ ప‌లు పుర‌స్కారాలు సొంతం చేసుకున్నారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల గ‌త కొంత‌ కాలంగా డబ్బింగ్‌కు దూరంగా ఉన్న బాలు.. కార్తి హీరోగా నటించిన తమిళ అనువాద చిత్రం ‘చినబాబు’ కోసం తన గళాన్ని సవరించుకున్నారు. ఇందులో క‌థానాయ‌కుడి తండ్రి పాత్రను సత్యరాజ్ పోషించారు. సత్యరాజ్ పోషించిన ఆ పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పారట‌ బాలు. ఇంతకాలం డబ్బింగ్‌కు దూరంగా ఉన్న బాలు.. ఇప్పుడు డబ్బింగ్ చెప్పడం వెనక ఉన్న కార‌ణం సత్యరాజ్ పాత్ర బాగా నచ్చడమే అని అంటున్నాయి చిత్ర వ‌ర్గాలు.

More News

సూర్య‌.. రెండేళ్ళు బిజీ

'గ‌జిని' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌.

దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్న హీరోయిన్ తమన్నా

క్వీన్ రీమేక్ సెట్స్ లో  హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి  తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో  శరవేగంగా జరుగుతోంది.

'పంతం' టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌

శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ సినిమా ఇది.

అవ‌కాశం గొప్ప‌ది.. అంకిత భావంతో క‌ష్ట‌ప‌డితేనె ప్ర‌తి ఫలం ద‌క్కుతుంది - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో వండర్‌ బార్‌ ఫిలింస్‌ ప్రై.లి, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై ధనుశ్ నిర్మించిన చిత్రం `కాలా`.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'యుద్ధభూమి'

1971 లో భార‌త స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన చిత్రం '1971 బియాండ్ బార్డ‌ర్స్'. మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌కత్వం వ‌హించారు.