నన్ను దూరం పెడుతున్నావా అని బాలుగారు కోపంగా అన్నారు : చిరంజీవి

గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. గత ఏడాది ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినీలోకం మొత్తం విలపించింది. నేడు అయన జయంతి కావడంతో సినీ ప్రముఖులు బాలుగారితో ఉన్న బంధాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు.

చిరంజీవి ట్విట్టర్ లో బాలు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా బాలుగారితో జరిగిన ఓ సంఘటనని గుర్తు చేసుకున్నారు. ఓ సందర్భంలో నేను బాలుగారిని 'ఎస్పీ బాలుగారు' అని సంభోదించాను. ఆ పిలుపుకు ఆయన బాధపడ్డారు.. కోపగించుకున్నారు. ఎప్పుడూ ప్రేమగా అన్నయ్య అని పిలిచేవాడివి.. ఇప్పుడు మర్యాదగా బాలుగారు అంటున్నావు.. ఏమైంది. నన్ను దూరం పెడుతున్నావా అని కోపంగా అన్నారు.

మీలాంటి వారిని ఏకవచనంతో పిలవడం సరికాదు అనిపించింది అని చెప్పాను. కానీ ఆయన వినలేదు. అలా పిలిచి నన్ను దూరం చేయొద్దు అని అన్నారు. కానీ ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. అందరికి దూరమై అన్యాయం చేశారు అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా బాలుగారి సోదరి ఎస్పీ వసంత పాడిన పాటని కూడా చిరంజీవి పొందుపరిచారు. చిరంజీవి కెరీర్ ని నెమరు వేసుకుంటే అందులో సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ బాలు పడినవే ఉంటాయి. ఇంద్ర చిత్రంలో బాలు చిరంజీవితో కలసి నటించారు.

More News

శృంగార వీడియో వైరల్.. పోలీసులని ఆశ్రయించిన నటి

గత కొన్ని రోజులుగా సామజిక మాధ్యమాల్లో ఓ అశ్లీల వీడియో వైరల్ గా మారింది.

పీటల మీద పెళ్లి ఆగిపోతే.. ఫ్రస్ట్రేషన్ లో 'ఏక్ మినీ కథ' హీరో!

ప్రస్తుతం యువ హీరో సంతోష్ శోభన్ పేరు బాగా వినిపిస్తోంది. బోల్డ్ అండ్ డిఫెరెంట్ కంటెంట్ 'ఏక్ మినీ కథ'తో మాయ చేశాడు.

బ్రేకింగ్ : టిఆర్ఎస్ కు ఈటెల రాజేందర్ రాజీనామా.. సంచలన కామెంట్స్!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈటెల రాజేందర్ వ్యవహారం నేటితో కొత్త మలుపు చోటు చేసుకుంది.

ఏపీలో డేంజర్ బెల్స్: 2 వారాల్లో 24 వేల మంది పిల్లలకు కరోనా!

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. చిన్న పిల్లల విషయంలో కొత్త భయాందోళన మొదలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

తొలిసారి తన కొడుకు ఫోటో షేర్ చేసిన శ్రేయ ఘోషల్.. పేరు ఏంటంటే!

శ్రేయ ఘోషల్ ప్రస్తుతం ఇండియాలో తిరుగులేని సింగర్. అన్ని భాషల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా శ్రేయ ఘోషల్ దూసుకుపోతోంది. ఆమె పాట పాడితే అది చార్ట్ బస్టర్ కావడం ఖాయం.