బండీ ఏంటిది.. ఎందుకింత ఓవర్ కాన్ఫిడెన్స్?

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముఖ్యంగా రెండు పార్టీల్లో ఊహించని మార్పులకు కారణమయ్యాయి. ఒక పార్టీ తమ కారణంగా జరిగిన తప్పిదాలపై దృష్టి సారిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లోగా ప్రజల్లో తమ పార్టీ పట్ల ఉన్న అసంతృప్తిని ఎలాగైనా అణచివేయాలని యత్నిస్తోంది. మరో పార్టీకి ఈ రెండు ఎలక్షన్ల ఫలితం ఓవర్ కాన్ఫిడెన్స్‌ని ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలి కాలంలో తన నోటికి బాగా పని చెబుతున్నారు. రెండు ఎలక్షన్స్‌కే ఇలా మాట్లాడితే రేపు అసెంబ్లీని కైవసం చేసుకుంటే పరిస్థితేంటని ప్రజలు ఆలోచనలో పడిపోయారు.

‘‘బీజేపీ పవిత్రమైన పార్టీ. తప్పులు చేసిన వారు పాప ప్రక్షాళన కోసం గంగ, గోదావరి నదుల్లో స్నానాలు చేస్తారు. మా పార్టీలోకి వస్తే పుణ్యం వస్తుంది’’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో చేరిన మనం చేసిన తప్పులకు ప్రక్షాళన జరుగుతుందట. దీనిని ఏమనాలో అర్థం కాని స్థితిలో సామాన్య ప్రజానీకం ఉండిపోయింది. రెండు ఎలక్షన్‌ల ఫలితం ఆయనతో ఈ మాటలు మాట్లాడిస్తోందా..? లేదంటే ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ వెళ్లి తమ పార్టీ పెద్దలతో అయిన భేటీ ఈ మాటలు మాట్లాడిస్తోందా? అనేది అర్థం కావడం లేదు.

ఇంకా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘టీఆర్‌ఎస్‌కు చెందిన 25-30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. మేం గేట్లు ఎత్తితే ఆ పార్టీ ఖాళీ..’’ అని వ్యాఖ్యానించారు. బీభత్సమైన ఓవర్ కాన్ఫిడెన్స్‌లో బండి సంజయ్ ఉన్నట్టు ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఇప్పటి వరకూ తిరుగులేకుండా అప్రతిహత విజయాన్ని కొనసాగించిన కేసీఆర్‌కే జనం ఝలక్ ఇచ్చారు. ఆయనతో పోలిస్తే బండి సంజయ్‌కు ఝలక్ ఇవ్వడం పెద్ద లెక్కేం కాదు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు తెలంగాణలో వివాదాస్పదమవుతున్నాయి. ఇదే రిపీట్ అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ బొక్క బోర్లా పడటం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.

More News

పవన్‌పై పృధ్వీరాజ్ ప్రశంసలు.. ట్రోల్స్ స్టార్ట్..

నిన్న మొన్నటి వరకూ మెగా ఫ్యామిలీపై తనదైన శైలిలో విరుచుకుపడిన ప్రముఖ నటుడు పృధ్వీరాజ్..

పవన్‌తో హరీష్ శంకర్ భేటీ.. ముహూర్తం సెట్ అయినట్టే..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశంకర్ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా ప్రారంభమైన టీకా డ్రైరన్..

దేశ వ్యాప్తంగా కరోనా టీకా డ్రైరన్ శనివారం ప్రారంభమైంది. కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా శుక్రవారం ఆస్ట్రాజెనెకా కంపెనీ,

బాలీవుడ్ రీమేక్‌లో విజయ్ సేతుపతి..

ఏ పాత్ర అయినా సరే.. అద్భుతంగా నటించి.. మెప్పించగల నటుడు.. విజయ్‌ సేతుపతి. అందుకే ఆయనకు అవకాశాలకేమీ కొదువ లేదు.

షూటింగ్‌ పూర్తికాక ముందే రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఒక రికార్డును నమోదు చేసుకుంది.