close
Choose your channels

2 గంటల్లోపే దారుస్సలాంను కూల్చేస్తాం: అక్బరుద్దీన్‌పై బండి సంజయ్ ఫైర్

Wednesday, November 25, 2020 • తెలుగు Comments

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 4,700 ఎకరాలున్న హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారని.. అలా అయితే హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బల్కంపేట్ రోడ్ షోలో బండి సంజయ్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

‘‘నీ అయ్య జాగీరా భయ్.. నీ తాత జాగీరా భయ్.. నీకు దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చు.. వాటిని కూల్చిన మరుక్షణమే రెండు గంటల్లోపే దారుస్సలాంను కూల్చేయడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. హిందూ ధర్మకోసం పాటుపడిన నా పీవీ నర్సింహారావు సమాధిని కూల్చే దమ్ముందా? దారుస్సలాంలో సౌండ్ చేస్తే.. ప్రగతి భవన్‌లో రీ సౌండ్ వస్తుంది’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇంకా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీకి వెళ్లాలంటే సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతోందన్నారు. సీఎం కేసీఆర్ పాతబస్తీ రావాలంటే.. ఓవైసీ పర్మిషన్ తీసుకోవాలని చార్మినార్ ఎమ్మెల్యే అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌తో బండి సంజయ్ పోల్చారు. సర్జికల్ స్ట్రైక్‌ను మరోమారు పునరుద్ఘాటించారు. బర్కత్ పురా ఎమ్మెల్యే సవాల్‌ను సీఎం కేసీఆర్ స్వీకరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పాత బస్తీ వెళ్లి కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు వసూలు చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz