‘ఆర్ఆర్ఆర్’ టీంకు బండి సంజయ్ వార్నింగ్..

‘ఆర్ఆర్ఆర్’ టీంకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కుమ్రం భీం పాత్రకు టోపి పెట్టిన సన్నివేశాన్ని తొలగించకుండా ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి సినిమాను విడుదల చేస్తే.. రీళ్లను తగులబెడతామని హెచ్చరించారు. ఈ సినిమాపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ సినిమాను ఎలా నడిపిస్తారో చూస్తామన్నారు. హిందూమతాన్ని అవమాన పరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్‌ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. కాగా.. కొమ్రం భీం 119వ జయంతి సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం ఆయనకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో విడుదలైన ఈ టీజర్‌కు చెర్రీ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ టీజర్ అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. టీజర్ విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

కాగా.. టీజర్ చివరిలో కుమ్రం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపీతో కనిపించాడు. నిజానికి ఇలాంటి టోపీని కుమ్రం భీం ఎప్పుడూ ధరించలేదని.. అసలు అప్పట్లో ఆ మతానికి చెందిన కొందరు వ్యక్తుల ఆగడాలకు వ్యతిరేకంగానే కుమ్రం భీం పోరాడారని ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి. కాబట్టి సినిమా నుంచి ఈ సన్నివేశాన్ని తొలగించాలని హెచ్చరిస్తున్నాయి. లేదంటే సినిమాను అడ్డుకుని తీరుతామని ఆదివాసీ సంఘాలు, బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

More News

మహేశ్‌ న్యూ ఇయర్‌ ప్లానింగ్‌..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.

పవర్‌స్టార్‌ సినిమాలో మరో హీరో ఈగ విలనేనా..?

ఈగ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ తర్వాత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు.

చరణ్‌ రికార్డ్‌..!

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పేరిట ఓ రికార్డ్ సొంతమైందని మెగాభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

పవన్‌కల్యాణ్‌ అడుగు పెట్టేది రేపే!!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’.

గాంధీ, నెహ్రులను విమర్శించిన కంగనా రనౌత్‌

శనివారం ఐరన్‌మ్యాన్‌ సర్దార్ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి.