డైరెక్ట‌ర్‌ని తిట్టుకుంటున్న బండ్ల గణేష్

  • IndiaGlitz, [Thursday,January 23 2020]

రీసెంట్‌గా ఓ  హిట్ కొట్టిన డైరెక్ట‌ర్‌ని స‌ద‌రు డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన సినిమాలో న‌టించిన న‌టుడు గట్టిగానే తిట్టుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ న‌టుడెవ‌రో కాదు.. బండ్ల‌గ‌ణేష్‌. ఆ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. చిన్నా చిత‌క వేషాలు వేసుకుంటూ త‌ర్వాత నిర్మాత‌గా మారి భారీ సినిమాలు నిర్మించిన బండ్ల‌గ‌ణేష్ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం అక్క‌డ అనుకోని దెబ్బ‌లు త‌గ‌ల‌డంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ అత‌నికే సినిమా రంగమే క‌న‌ప‌డింది.

అలాంటి స‌మ‌యంలో అనిల్ రావిపూడి.. బండ్ల‌గణేష్‌ని క‌లిసి 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో ఓ పాత్ర‌ను ఆఫ‌ర్ చేశాడు. చెప్పేట‌ప్పుడు పాత్ర గురించి అద్భుతంగా చెప్ప‌డంతో త‌న పాత్ర‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంద‌ని భావించిన బండ్ల సినిమాలో న‌టించ‌డానికి వెంట‌నే ఓకే చెప్పేశాడు.కానీ తీరా సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత బండ్ల గ‌ణేష్‌కు పెద్ద షాకే త‌గిలింది. ఎందుకంటే ఆయ‌న పాత్ర రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ‌గా లేదు. అంతా ఎడిట్‌లో లేపేసారు. దీంతో ఆయ‌న పాత్ర‌కు ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. స‌రి క‌దా! వాళ్ల కుటుంబ స‌భ్యులు కూడా ఇలాంటి పాత్ర‌ను ఎందుకు చేశావు? అని అడ‌గ‌టంతో బండ్ల మ‌రింత బాధ ప‌డాల్సి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న‌ను క‌లిసి వాళ్లంద‌రికీ చెబుతున్నాడ‌ట‌. అస‌లు త‌న పాత్ర‌ను మొత్తం తీసేసి ఉన్నా తాను బాధ‌ప‌డేవాడిని కాన‌ని, 90 శాతం పాత్ర‌ను ఎడిట్ చేసేశార‌ని వాపోతున్నాడ‌ట బండ్ల గ‌ణేష్‌.

More News

మ‌ళ్లీ అక్క‌డ‌కు ప్లాన్ చేస్తున్న ప్ర‌భాస్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ తాజా చిత్రం `జాన్‌`(విన‌ప‌డుతున్న పేరు) చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో

వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' ఫస్ట్ లుక్ విడుదల

సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది.

'83' చిత్రాన్నిరిల‌య‌న్స్ సంస్థ‌తో క‌లిసి విడుదల చేస్తున్న నాగార్జున

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవత్స‌రాన్ని సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించాలి. ఆ ఏడాది క‌పిల్ దేవ్ నాయ‌కత్వంలో భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించింది.  

'సవారి' కంటెంట్ ఉన్న సినిమా: హీరో సుధీర్ బాబు

నందు హీరోగా నటిస్తోన్న 'సవారి' మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో జరిగింది.

కన్నుల పండుగగా సాగిన జీ తెలుగు  జీ సినీ అవార్డ్స్‌ 2020

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అద్భుతమైన సీరియల్స్‌, అదిరిపోయే రియాలిటీ షోస్‌.. అంతకుమించిన సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది జీ తెలుగు.