close
Choose your channels

బండ్ల గ‌ణేష్ పప్పుసుద్ద‌

Tuesday, April 23, 2019 • తెలుగు Comments

బండ్ల గ‌ణేష్ పప్పుసుద్ద‌

న‌టుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గ‌ణేష్ త‌ర్వాత నిర్మాత‌గా మారి స్టార్ హీరోల‌తో సినిమాలు చేశాడు. త‌ర్వాత రాజ‌కీయాల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేశాడు. మొత్తానికి రాజ‌కీయాలు త‌న‌కు న‌ప్ప‌వ‌ని గ్ర‌హించిన‌ట్లున్నాడేమో  రాజ‌కీయాల నుండి పూర్తిగా ప‌క్క‌కు వ‌చ్చేసిన‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు. మ‌హేష్‌, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.  ఇందులో బండ్ల గ‌ణేష్ కోటీశ్వ‌రుడై ఉండి.. క‌నీస జ్ఞానం లేకుండా ఏవేవో మాట్లాడే ప‌ప్పుసుద్ద‌ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

Get Breaking News Alerts From IndiaGlitz