close
Choose your channels

బండ్ల గణేశ్ ఎంత ఆఫ్ట్రల్.. నాకు కనిపించాడో..!

Tuesday, January 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బండ్ల గణేశ్ ఎంత ఆఫ్ట్రల్.. నాకు కనిపించాడో..!

టాలీవుడ్ ప్రొడ్యూసర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేశ్‌‌కు రాజకీయల్లోకి రాకముందు నుంచి నాయకులతో ఏ విధమైన పరిచయాలున్నాయో ఇవాళ కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అవసరమైతే అమెరికా అధ్యక్షుడితో అయినా సరే క్షణాల్లో ఫొటో దిగేంత రేంజ్ తనకుందని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు చాలెంజ్‌‌లు చేయడం, ఎంతటివార్నైనా సరే చీపురుపుల్లలా తీసిపారేయడంలోనూ ఆయనకు ఆయనేసాటని విమర్శకులు చెబుతుంటారు. బండ్లగణేశ్- మద్దెలచెర్వు సూరికి ఉన్న అనుబంధం గురించి ఇవాళేం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సూరి హవా నడుస్తున్నప్పుడు.. సూరి అన్నా అంటూ ఆయనవెంబడి తిరుగుతూ తన పనులు చేయించుకునేవాడని.. అంతేకాదు కొన్ని సెటిల్మెంట్స్ సైతం చేసేవాడనే ఆరోపణలు బండ్లపై ఉన్నాయి.

అయితే ఆయన మరణాంతరం ఓ ఇంటర్వ్యూలో సూరి గురించి చర్చ వచ్చినప్పుడు సడన్‌‌గా.. ఆయనెవరు..? అతనికి నాకేం సబంధం లేదే..? అన్నట్లుగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తుపోయిన సూరి భార్య, వైసీపీ నేత గంగుల భానుమతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బండ్లను దుమ్ముదులిపి వదిలారు. "సూరిగాడెవడో తెలియదు.. నాకు ఆయనకేంటి సంబంధం అని ఇలా చాలా మాటలే అన్నాడు" ఇవన్నీ విన్నానని తనకు భవిష్యత్తులో ఎక్కడైనా కనిపిస్తే.. అంటూ భానుమతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజంగానే తెలియదా.. కచ్చితంగా అడుగుతా!

"భాను వచ్చి నీ దగ్గర డబ్బులు పెట్టినప్పుడు.. భాను, సూరి ఇద్దరూ తెలుసు. సూరి చనిపోయిన తర్వాత.. భాను జైలుకెళ్లిన తర్వాత వాళ్లిద్దరెవరో తెలియదంటారా..? భాను ఏం తక్కువైనోడు కాదు.. డబ్బులు అందరిదగ్గరా పెట్టాడు. భానుతో కలిసి మీరొచ్చినప్పుడు సూరికి అన్నా నమస్తే.. అని చెప్పే వ్యక్తి బండ్ల గణేశ్. కానీ సూరి చనిపోయి... భాను జైలుకెళ్లిన తర్వాత.. సూరి, భాను ఇద్దరూ తెలియదా..? ఆయన నాకు దొరికితే నేను కచ్చితంగా సూరి తెలుసో.. తెలియదో అడుగుతాను. భవిష్యత్తులో ఆయన నాకెప్పుడైనా కనపడితే కచ్చితంగా నేను మాట్లాడతాను" అని భానుమతి చెప్పుకొచ్చారు.

అసలు నీ స్థాయేంటి..?

"సూరి స్థాయి ఏంటి..? నీ(బండ్ల గణేశ్) స్థాయేంటి..?. భాను గురించి మాట్లాడావ్.. నాకేం బాధలేదు. వాడెవడో.. ఈడెవడో ఇంకేమైనా మాట్లాడుకో.. బూతులు తిట్టుకో నాకేం బాధ లేదు.. నాకు సంబంధం లేని విషయమది. కానీ సూరి ఎవరెవరో తెలియదనడమేంటి..? అసలు నీ స్థాయేంటి. నువ్ ఆఫ్ట్రల్ ప్రొడ్యూసర్ అంతేకదా. కానీ సూరి రెండు, మూడు రాష్ట్రాల్లో పేరుంది.. ఆయనకు అభిమానులున్నారు. సూరికి ఇప్పుడు కూడా పేరుంది.. నీకు ఎక్కడైనా పేరుందా. మొన్న కూడా బ్లేడ్‌‌తో గొంతు కోసుకుంటానని అన్నావ్.. అసలు ఇది అనాల్సిన మాటేనా.." అంటూ బండ్లపై భానుమతి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.