చిరంజీవి యువత నుంచి బండ్రెడ్డు ఔట్

ఇంటి దొంగలను పనిపట్టే పనిలో జనసేన సిద్ధమవుతోందని.. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలపాలు సాగించినా లీగల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీలోని ముఖ్యనేతలు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన చేసిన 24 గంటలు గడవక ముందే చర్యలు ప్రారంభించింది.

పూర్తి వివరాల్లోకెళితే.. మెగాభిమాని ముసుగులో క్రమశిక్షణారాహిత్యంతో వ్యతిరేక కార్యకలాపాలకు ప్పాడుతున్న గుంటూరుకు చెందిన బండ్రెడ్డు చందుని చిరంజీవి యువత, పవన్‌కళ్యాణ్‌ అభిమాన సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని ఏపీ చిరంజీవి యువత అధ్యక్షుడు ఎల్ శ్యామ్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. చిరంజీవి అభిమానిగా, జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్న బండ్రెడ్డు చందు నియమనిబంధనలను ఉల్లంఘిస్తూ అనేకమార్లు మెగాభిమానుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడమే కాకుండా ఇటీవల సోషల్‌ మీడియాలో లైవ్‌ పెట్టి మరీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందువల్ల అనివార్యంగా ఆయనపై ఈ చర్య తీసుకోవడం జరిగిందని ఈ వ్యవహారంపై శ్యామ్ వివరణ ఇచ్చుకున్నారు.

ఏ సంఘంలోనైనా, పార్టీలోనైనా క్రమశిక్షణగా మెలగడం తప్పనిసరి అని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదన్నారు. బండ్రెడ్డు చందుపై ఈ సస్పెన్షన్‌ తక్షణం అమలులోకి వస్తుందని ఇకపై చిరంజీవి యువత, మెగా కుటుంబంతో ఆయనకెటువంటి సంబంధం లేదని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నట్లు శ్యామ్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

More News

ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు త్రినయని సీరియల్‌తో మీ ముందుకు వస్తోన్న జీ తెలుగు

అద్భుతమైన కథలు, అత్యద్భుతమైన సీరియల్స్‌, అంతకుమించిన రియాలిటీ షోస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని జీ తెలుగు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తోంది.

‘ఇండియ‌న్ 2’ ప్ర‌మాదంపై శంక‌ర్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు.

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంక‌ల్ప్‌

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు. ఇప్పుడు కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఓ భారీ యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు.

'త‌లైవి' డైరెక్ట‌ర్‌పై ర‌చ‌యిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `త‌లైవి`. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు పాత్ర ఇదే ?

ప్ర‌స్తుతం మ‌హేశ్ 27వ సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సింది ..క‌థ బాగోలేద‌నే కార‌ణంతో ఆగింది.