'రక్తం' కు అంతర్జాతీయ అవార్డు రావడం ఓ గ్రేట్ థింగ్: నటుడు బెనర్జీ

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

సీనియ‌ర్ న‌టుడు బెన‌ర్జీ ప్ర‌ధాన పాత్ర లో రాజేష్ ట‌చ్ రివ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ర‌క్తం' చిత్రానికి అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేద‌రింగ్ ఫారిన్ డ్రామా ఫీచ‌ర్స్ సెగ్మెంట్ లో (2017) అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. న‌క్స‌లైట్ బ్యాక్ డ్రాప్ లో హింసాత్మ‌క మార్గంలోనే నైతిక విలువ‌లు గురించిన చెప్పిన సినిమా ఇది. ఈ సంద‌ర్భంగా సినిమాకు అవార్డు రావ‌డం ప‌ట్ల ప్ర‌ధాన పాత్ర‌ధారి బెన‌ర్జీ సంతోషం వ్య‌క్తం చేశారు.
ఆయ‌న మాట్లాడుతూ, ' నా 36 ఏళ్ల సినిమా కెరీర్ లో జీవితాంతం గుర్తుండిపోయే ఓ మ‌ధుర ఘ‌ట్టం ఇది. ఇలాంటి అరుదైన అవ‌కాశం ద‌క్కినందుకు చాలా సంతృప్తిగా ఉంది. మ‌న తెలుగు సినిమా మ‌రోసారి అంత‌ర్జాతీయ స్థాయి కి చేరుకోవ‌డం గొప్ప విష‌యం. ఈ అవార్డు ఓ గ్రేట్ థింగ్. ర‌క్తంలో మంచి పాత్ర లో న‌టించే అవ‌కాశం ఇచ్చిన చిత్ర ద‌ర్శ‌కులు రాజేష్ గారికి, నిర్మాత సునీత కృష్ణ‌న్ గారికి, స‌హ నిర్మాత మునిషీ రైజ్ అహ్మ‌ద్ గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. రాజేష్ గారు గ‌తంలో ఎన్నో జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయి అవార్డు సినిమాలు తెర‌కెక్కించి కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను గడించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఆగ‌స్టు 13 అమెరికాలోని ఓహియో హ‌డ్సన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో 'ర‌క్తం' చిత్రం ప్ర‌ద‌ర్శింబ‌ప‌డుతుంది. అదే రోజు అవార్డు ప్ర‌దానోత్స‌వం కూడా ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కులు రాజేష్ ట‌చ్ రివ‌ర్, నిర్మాత సునీత కృష్ణ‌న్, స‌హ నిర్మాత మునిషీ రైజ్ అహ్మ‌ద్ , నేను హాజ‌ర‌వుతున్నాం' అని తెలిపారు.
'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) లో వైస్ ప్రెసిడెంట్ గా కొన‌సాగుతున్న బెర‌ర్జీని, 'ర‌క్తం' ద‌ర్శ‌కుడు రాజేష్ ట‌చ్ రివ‌ర్, నిర్మాత సునీత కృష్ణ‌న్, స‌హ నిర్మాత మునిషీ రైజ్ అహ్మ‌ద్ ను ఈ సంద‌ర్భంగా 'మా' టీమ్ అంతా అభినందించారు.

More News

విజయపథంలో గువ్వ గోరింక తొలిపాట

తొలిపాటతోనే మా గువ్వ గోరింక చిత్రం అటు టాలీవుడ్లో..

'ఏజెంట్ భైరవ' తెలుగు ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ ఎంటర్ టైనర్- నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్పై విజయ్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏజెంట్ భైరవ'.భరతన్ దర్శకుడు.

'దండుపాళ్యం' దర్శకుడు శ్రీనివాసరాజు 5 భాషల్లో రూపొందిస్తున్న మరో సంచలన చిత్రం

'దండుపాళ్యం' వంటి సంచలన చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయాల్ని అందుకున్న దర్శకుడు శ్రీనివాసరాజు ఆ చిత్రానికి సీక్వెల్గా 'దండుపాళ్యం2' చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

జూలై 14న వస్తున్న 'పటేల్ సార్'

వారాహి చలనచిత్రం బ్యానర్ లో రజిని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ రివెంజ్ డ్రామా "పటేల్ సార్". జగపతిబాబు టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

తొలిసారిగా పూర్తిగా మహిళలతోనే నిర్మిస్తున్న చిత్రం

తెలుగు చలన చిత్ర చరిత్రలో కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన భీమవరం టాకీస్ బ్యానర్పై రూపొందనున్న 91 వ చిత్రం జూలై 14 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.