close
Choose your channels

ప‌వ‌న్ బంగారానికి పురుగుల ఫుడ్‌

Monday, August 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌న్ బంగారానికి పురుగుల ఫుడ్‌

కొన్ని విష‌యాలు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తాయి. కానీ ఒక్క‌సారి వ‌చ్చాక మాత్రం వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించేస్తాయి. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్ విష‌యంలో జ‌రిగింది అదే. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న `బంగారం` చిత్రంలో న‌టించిన మీరాచోప్రాకు పురుగుల ఫుడ్ పెట్టార‌ట‌. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా చెప్పుకొచ్చింది. అంతేకాదు త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ట్రెండ్ చేయ‌మ‌ని కూడా చెప్పింది. ఉత్త‌రాది భామ మీరాచోప్రా ద‌క్షిణాదిన తొలుత త‌మిళ్‌లో `అన్బే అన్బే` అని ఒక సినిమాలో న‌టించారు. ఆ చిత్రంలో ఆమె న‌ట‌న న‌చ్చి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న `బంగారం`లో తీసుకున్నారు. ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన ఆమె అప్ప‌టి నుంచీ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే స‌రైన హిట్టు మాత్రం లేదు. తాజాగా కూడా తెలుగు, హిందీలో `మొగ‌లి పువ్వు` అని ఓ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఆమె గుజ‌రాత్ రాజ‌ధారి అహ్మ‌దాబాద్‌లోని డ‌బుల్ ట్రీ హోట‌ల్‌లో బ‌స చేశారు. ఆ హోట‌ల్‌కి వెళ్లిన‌ప్ప‌టి నుంచీ ఆమె ఆరోగ్యం కుదురుగా లేదు. అందుకే ఆమె త‌ను ఏం తింటుందో, ఏం తాగుతుందో నిశితంగా ప‌రిశీలించ‌సాగారు. ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్ ఆర్డ‌ర్ చేస్తే దాన్లో తెల్ల‌టి పురుగులు వ‌చ్చాయట‌. వెంట‌నే దాన్ని ఆమె వీడియో తీశారు.
అంత‌టితో ఆగ‌కుండా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

``మేం ఒక్కోరోజు ఇలాంటి హోట‌ల్స్ లో ఉండ‌టానికి ఎంతో ఖ‌ర్చు చేస్తుంటాం. కానీ ఈ హోట‌ల్ వాళ్లు మాత్రం మ‌మ్మ‌ల్ని స‌రిగా ట్రీట్ చేయ‌రు. పైగా పురుగుల భోజ‌నం పెట్ట‌డం దారుణం. ఇక్క‌డ శుభ్ర‌త లేదు`` అని ఆవేశంగా రాసుకొచ్చారు. త‌న‌కు ఏదైనా అన్యాయం జ‌రిగితే దాన్ని బాహాటంగా చెప్ప‌డం మీరాచోప్రాకు మొద‌టి నుంచీ అల‌వాటే.

ఇంత‌కు ముందు కూడా స్నానానికి మిన‌ర‌ల్ వాట‌ర్ అడుగుతోంద‌ని ఆమె మీద ఓ త‌మిళ నిర్మాత కంప్లెయింట్ ఇస్తే, అస‌లు ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ఆమె ఉన్న‌దున్న‌ట్టు మీడియాకు చెప్పేశారు. మొద‌టి నుంచీ ప‌వ‌ర్‌ఫుల్ లేడీగా ఉన్న మీరా చోప్రా న‌టిస్తున్న తాజా చిత్రం `మొగ‌లిపువ్వు` విశేషాలు తెలియాల్సి ఉంది. ఆమె ప‌ట్ల హోట‌ల్ య‌జ‌మాన్య నిర్ల‌క్ష్య ధోర‌ణికి సంబంధిత శాఖ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.