'బంగారి బాలరాజు' విజయంతో ముందుగానే మాకు దీపావళి వచ్చింది - దర్శకనిర్మాతలు

  • IndiaGlitz, [Thursday,October 25 2018]

ఎటువంటి అంచనాలు లేకుండా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మౌత్ టాక్ తో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ సందర్బంగా చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ దగ్గర కేక్ ను కట్ చేసి, బాణాసంచాని కాల్చి దీపావళిని ఆనందంగా ముందుగానే జరుపుకుంది.

రాయలసీమలో పరువు హత్యల నేపధ్యంలో యధార్ధ ప్రేమకధతో వచ్చిన మా బంగారి బాలరాజు విజయానందాన్ని మీడియాతో దర్శకుడు కోటేంద్ర దుద్యాల పంచుకుంటూ.... బంగారి బాలరాజు విజయానికి కారకులైన ప్రేక్షక దేవుళ్లకు మరియు నా మీడియా మిత్రులకు దన్యవాదాలు తెలియజేస్తూ, నేనూ మీడియానుండి వచ్చిన వాడినే, నేను దర్శకుడిగా సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రొడ్యూసర్స్ కు మా చిత్రయూనిట్ కి ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు.

చిత్రహీరో రాఘవ్ మాట్లాడుతూ... నా మొదటి సినిమానే మంచి సక్సెస్ ను సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ కోటేంద్ర సార్ కు నా జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అలాగే మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మా చిత్రం ఎటువంటి అంచానాలు లేకుండా విడుదల చేశాము. కానీ కొంతమంది మా శ్రేయోభిలాషులు ఎందుకు సొంతంగా విడుదల చేసుకుని రిస్క్ తీసుకోవడం అని అనడంతో కొంత ఆందోళన చెందాము కానీ కధ మీద, దర్శకుడి మీద నమ్మకంతో 113 ధియేటర్లలో వరల్డ్ వైడ్ గా “బంగారి బాలరాజు” ను విడుదల చేశాము. ఇప్పుడీ సినిమా మౌత్ టాక్ తో మా చిత్రయూనిట్ కు ముందుగానే దీపావళి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ నుండి కూడా సోమవారం నుండి మరిన్ని ధియేటర్స్ ను పెంచుతామని రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

More News

24 కిసెస్ ట్రైలర్ లాంచ్

సిల్లీ మానక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పించు రెస్పెక్ట్ క్రియేషన్స్ వారి అనీల్ ్ల, సంజయ్ నిర్మించిన చిత్రం ౨౪కిసెస్. అయోధ్యకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అదిత్ అరుణ్, హెబ్బాపటేల్

'రోషగాడు' టీజర్ విడుదల

విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం "రోషగాడు". ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్  ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు.

'2.0' ట్రైల‌ర్ డేట్‌

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'.

కార్తీ నటిస్తున్న 'దేవ్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దేవ్‌' .. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

త్వ‌ర‌లోనే 'టైటానిక్ 2'

అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఒక‌టి 'టైటానిక్'. జేమ్స్ కామెరూన్ దర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ హాలీవుడ్ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ జంటగా నటించారు.