'జీ 5' ఓటీటీలో ఫిబ్రవరి 18న సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'బంగార్రాజు' విడుదల

  • IndiaGlitz, [Wednesday,February 09 2022]

'జీ 5' ఓటీటీ లక్ష్యం ఒక్కటే... వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా... ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే 'జీ 5' ముఖ్య ఉద్దేశం. ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తోంది 'జీ 5'. తాజాగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ 'బంగార్రాజు'ను విడుదల చేయడానికి సిద్ధమైంది.

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా 'బంగార్రాజు'. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు'... అనేది ఉపశీర్షిక. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నాగార్జున నిర్మాత. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి తీసుకొస్తోంది 'జీ 5'. ఫిబ్రవరి 18 నుంచి 'జీ 5' ఓటీటీలో సినిమా అందుబాటులోకి రానుంది.

అక్కినేని ఫ్యామిలీ - అన్నపూర్ణ స్టూడియోస్‌కు, 'జీ 5'కు మధ్య చక్కటి అసోసియేషన్ ఉంది. ఆల్రెడీ 'జీ 5'లో వీక్షకులను అలరిస్తున్న 'లూజర్ 2' ఒరిజినల్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. అఖిల్ 'హలో'ను, నాగచైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలను ఓటీటీలో 'జీ 5' విడుదల చేసింది. ఆ రెండూ సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం మీద రూపొందాయి.

ఇటీవల 'లూజర్ 2'తో వీక్షకుల మనసులను మరోసారి గెలుచుకుంది 'జీ 5'. ఈ నెల 11న అక్కినేని మనవడు సుమంత్ హీరోగా నటించిన 'మళ్ళీ మొదలైంది' సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా ఓటీటీలో విడుద‌ల చేస్తోంది.

More News

రేపు జగన్‌ను కలవనున్న చిరంజీవి..  మెగాస్టార్ వెంట ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్..?

సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్‌ రేట్ల వివాదానికి ఏదో ఒక పరిష్కారం చూపాలని అటు టాలీవుడ్ పెద్దలు..

మేడారం జాతరలో కీలక ఘట్టం.. నేడు మండమెలిగె పండుగ

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం ‘‘సమ్మక్క- సారలమ్మ’’ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్.. యువకుడిని తన చేతులతో మోసుకుని ఆసుపత్రికి

సోనూసూద్... వెండితెరకు విలన్‌గానే తెలిసిన ఈ వ్యక్తి, అతని వ్యక్తిత్వం కోవిడ్ కష్టకాలంలో లోకానికి తెలిసింది.

హిజాబ్ వివాదం.. తమిళనాడుకు పాకనివ్వకండి : కమల్‌హాసన్ సంచలన ట్వీట్

కర్ణాటకను హిజాబ్ వ్యవహారం కుదుపేస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటుండటం, పరిస్ధితులు అదుపు తప్పుతుండటంతో సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు.

దేశాన్ని ఊపేస్తోన్న పుష్ప ఫీవర్.. రాజ్‌నాథ్ నోట ‘‘తగ్గేదే లే’’ డైలాగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘‘పుష్ప’’.