బ్యాంకులకు వరుస సెలవులు... ఖాతాదారులు జాగ్రత్త

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

బ్యాంక్ ఖాతాదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి 30 వరకు బ్యాంకులకు వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో ముందుగానే ఖర్చులకు డబ్బులు తీసిపెట్టుకుంటే బాగుంటుంది.

ఈ నెల 26, 27న బ్యాంక్ యూనియన్లు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం తో ఈ రెండు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ తర్వాత రోజు నాలుగో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు తెరుచుకోవు. ఇక 30వ తేదీన హాఫ్ ఇయర్లి క్లోజింగ్ కావున బ్యాంకులు పనిచేయవు.

అక్టోబర్ 1న బ్యాంకులకు సెలవులు కాకపోయినా... ఉద్యోగులు మాత్రం వరుస సెలవులు పెట్టే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి నేషనల్ హాలిడే. అంటే వరుసగా బ్యాంకుల లావాదేవీలు జరగక సామాన్య ప్రజలు ఇబ్బంది పడడమే కాదు... ఉద్యోగుల జీతాల విషయంలోనూ ఇబ్బందులే.

More News

'గద్దలకొండగణేష్‌' సినిమాకి మొదటి షో నుండే ఇంతమంచి అప్రిసియేషన్‌ రావడం హ్యాపీగా ఉంది - చిత్ర యూనిట్

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'గద్దలకొండగణేష్‌'.

కిషన్ రెడ్డితో గల్లా, అఖిల ప్రియ భేటీ

కిషన్ రెడ్డితో గల్లా, అఖిల ప్రియ భేటీకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో టిడిపి ఎంపీ గల్ల జయదేవ్, భూమా అఖిల ప్రియల భేటీ అయ్యారు.

వాల్మీకి టైటిల్ మార్పులో వైసీపీ ఎంపీ హస్తం?

వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ చిత్రం రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో షూటింగ్ జ‌రుపుకొంటున్న‌ 'ఎంత మంచివాడ‌వురా'

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్   ఫిల్మ్స్  సంస్థ భారీగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఎంత మంచివాడ‌వురా`.

ఆన్ లైన్లో టికెట్ల కొనుగోలు రద్దు : తలసాని

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాన్ని త్వరలోనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.