close
Choose your channels

బ్యాంకులు ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే..

Saturday, June 1, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్యాంకులు ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే..

భారత దేశంలోని వాణిజ్య బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని భారత రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది కూడా. ఈ సెలవు దినాలకు సంబంధించి ఇంత వరకూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. పుకార్లు నమ్మకండని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇదంతా గతం.. ఆ పుకార్లు అక్షరాలా నిజమయ్యాయి. శనివారం సాయంత్రం ఈ ప్రతిపాదనపై క్లారిటీ వచ్చేసింది.

ఈ వ్యవహారంపై మరోసారి స్పందించిన రిజర్వ్ బ్యాంక్ అవును నిజమే.. ప్రతీ శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుందని.. జూన్-1 నుంచి ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సో.. ఇక బ్యాంక్‌ ఉద్యోగులు ఐదు రోజులు మాత్రమే విధులు నిర్వహించాలన్న మాట. అయితే ఐదు రోజులు మాత్రమ అయినప్పటికీ ప్రతీరోజూ ఎక్స్ ట్రా గంటలు చేయాల్సి వస్తుందని.. ఆ శనివారంను ఈ ఐదు రోజుల్లో కవర్ చేసేలా.. రిజర్వ్ బ్యాంక్ పక్కాగా తేల్చి చెప్పింది. 

ఇప్పటి వరకూ ప్రతీ రోజు ఉదయం 10గంటలకు బ్యాంకులు తెరుచుకుని 4 గంటలకు మూతపడేవి. అయితే ఇకపై ఉదయం 8:30 గంటలకు తెరుచుకుని సాయంత్రం 6:30 గంటలకు మూతపడనున్నాయి. అంటే  ప్రతి రోజూ ఉదయం ఒకటిన్నర గంట.. సాయంత్రం రెండుగంటలు ఉద్యోగులు పనిచేయాల్సిందేన్న మాట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో.. రిజర్వ్ బ్యాంక్ ఓ ఉత్తర్వును సైతం విడదుల చేసింది. సో.. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.