బీస్ట్ విడుదల : విజయ్ ఫ్యాన్స్ వీరంగం .. సినిమా నచ్చలేదంటూ,  స్క్రీన్‌కు నిప్పు

  • IndiaGlitz, [Wednesday,April 13 2022]

తమిళ అగ్ర కథానాయకుడు , ఇళయ దళపతి విజయ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘బీస్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌య‌న‌తార‌తో కోకిల‌, శివ కార్తికేయ‌న్‌తో డాక్ట‌ర్ సినిమాల‌ను తెరకెక్కించి సూప‌ర్‌హిట్ సొంతం చేసుకున్న నెల్స‌న్ దిలీప్ కుమార్ .. సూపర్‌స్టార్ విజ‌య్‌తో ఎలాంటి సినిమా చేస్తారోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. అయితే ‘బీస్ట్’ ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత అంచ‌నాలు ఓ రేంజ్‌కు చేరాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఈరోజు బీస్ట్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్ర విడుదల నేపథ్యంలో తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది. విజయ్ అభిమానులు వూరు వాడా సంబరాలు జరుపుతున్నారు. అయితే సినిమాకు తెల్లవారుజాము నుంచే నెగెటివ్‌ టాక్‌ వస్తోంది. సినిమా తమ అంచనాలను అందుకోలేకపోయిందని మండిపడుతున్నారు విజయ్ అభిమానులు. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్తే చివరికి నిరాశతో బయటకు రావాల్సి వస్తోందంటూ పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఈ క్రమంలో తమిళనాడులోని ఓ థియేటర్‌లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులకు బీస్ట్‌ సినిమా నచ్చలేదు. అంతే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే స్క్రీన్‌కు నిప్పంటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్న సంగతి తెలియాల్సి వుంది.

More News

డ్యాన్సులు, ఫైట్స్‌ల్లో చిరు- చరణ్ జోరు : ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న ‘‘ఆచార్య’’ ట్రైలర్

సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. కెరీర్‌లో పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం..

తండ్రి కలను నిజం చేసిన అలీ కూతురు.. మురిసిపోతున్న కుటుంబం, ఫ్యాన్స్ విషెస్

పిల్లలు పుట్టగానే సరిపోదు.. వాళ్లు పెరిగి ప్రయోజకులై , వారి గురించి నలుగురూ చెబితే వినాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు.

దటీజ్ రామ్ చరణ్.. మంచి మనసుకు ఈ ఘటనే నిదర్శనం , కాదంబరి కిరణ్ పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్.

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ కొత్త చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు.

ఏపీ కొత్త కేబినెట్.. మంత్రులకు శాఖల కేటాయింపు, రోజాకు ఏ శాఖంటే..?

అలకలు, అసంతృప్తులు, ధిక్కార స్వరాలు, రాజీనామాలు , నిరసనలు ఇలా రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై కనిపించిన పరిస్థితులు.