'ఏజెంట్ భైరవ' తెలుగు ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ ఎంటర్ టైనర్- నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

పుష్యమి ఫిలిం మేకర్స్‌ బ్యానర్‌పై విజయ్‌, కీర్తి సురేష్‌ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏజెంట్‌ భైరవ'. భరతన్‌ దర్శకుడు. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మాత. ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో సినిమా గురించిన సంగతులను తెలియజేశారు.

నిర్మాత నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ - ''విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'ఏజెంట్‌ భైరవ' సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఆన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఉంటుంది. ఇందులో హీరో విజయ్‌ ఓ బ్యాంక్‌లో కలెక్షన్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఓ పెళ్ళిలో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ని చూసి ప్రేమలో పడతాడు. కానీ కీర్తి సురేష్‌ ఓ ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హీరో ఆమెకు అండగా నిలబడ్డాడనేదే కథ. ఈ సినిమాలో జగపతిబాబుగారు పిడకల కోటయ్య అనే క్యారెక్టర్‌లో కనపడతాడు. మాంసం అమ్ముకునే పిడకల కోటయ్య ఉన్నట్లుండి పెద్ద బిజినెస్‌మేన్‌గా ఎలా మారాడు. కాలేజీలను ఎలా స్థాపించాడు. దాని వల్ల హీరోయిన్‌కు వచ్చే సమస్య ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమాజంలో ప్రతి విషయానికి ఓ క్వాలిఫికేషన్‌ ఉంది. కానీ ప్రైవేటు కాలేజీలు నడిపే పెద్ద మనుషులకు క్వాలిఫికేషన్‌ ఎందుకు లేదనే పాయింట్‌తో సినిమా నడుస్తుంది. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు చాలా పెద్ద ప్లస్‌ అవుతుంది. ఈ సినిమాను తమిళంలో విజయ బ్యానర్‌వారు నిర్మించారు. వారు తెలుగు ప్రేక్షకులు, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే డైలాగ్స్‌, సీన్స్‌ డిజైన్‌ చేయడం వల్ల సినిమా మన తెలుగువారికి కూడా బాగా నచ్చుతుంది. నేను దర్శకుడిగా చింతపల్లి రమణగారి రచనలో ఓ సినిమా చేయబోతున్నాను.

ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీ. కథకు తగ్గట్లు మంచి లీడింగ్‌ హీరోయిన్‌ ఈ సినిమాలో నటిస్తుంది. అలాగే నా బ్యానర్‌లో బెలూన్‌, స్వామి2 సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాను. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'యదాతథం' కోసం నేను దర్శకుడిగా మారాను. అందులో భాగంగానే 'దృశ్యకావ్యం' సినిమా చేశాను. కానీ ఆ సినిమా సమయంలోనే హీరోయిన్‌కు పెళ్ళి కావడం, ఆ హీరోయిన్‌ భర్త సినిమాలు చేయడానికి అంగీకరించకపోవడంతో దృశ్యకావ్యం2 సినిమా చేయలేకపోయాం. ఇక బెలూన్‌ సినిమాలో రాజ్‌తరుణ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక మా ఏజెంట్‌ భైరవ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను ఇప్పటికి 235 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ఇంకా థియేటర్స్‌ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి'' అన్నారు.

More News

'దండుపాళ్యం' దర్శకుడు శ్రీనివాసరాజు 5 భాషల్లో రూపొందిస్తున్న మరో సంచలన చిత్రం

'దండుపాళ్యం' వంటి సంచలన చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయాల్ని అందుకున్న దర్శకుడు శ్రీనివాసరాజు ఆ చిత్రానికి సీక్వెల్గా 'దండుపాళ్యం2' చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

జూలై 14న వస్తున్న 'పటేల్ సార్'

వారాహి చలనచిత్రం బ్యానర్ లో రజిని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ రివెంజ్ డ్రామా "పటేల్ సార్". జగపతిబాబు టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

తొలిసారిగా పూర్తిగా మహిళలతోనే నిర్మిస్తున్న చిత్రం

తెలుగు చలన చిత్ర చరిత్రలో కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన భీమవరం టాకీస్ బ్యానర్పై రూపొందనున్న 91 వ చిత్రం జూలై 14 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

'ఫిదా' రిలీజ్ డేట్

'ముకుంద,కంచె వంటి విలక్షణ చిత్రాలతో మెప్పించిన మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా

పాంచాలిగా నయన

ప్రేక్షకుల్లో కూడా బాహుబలి తర్వాత హిస్టారికల్,జానపద చిత్రాలు చూడాలనే కోరిక పెరిగింది.